Rajinikanth: బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగుతున్న 'జైలర్' హవా, అన్ని చోట్లా షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-08-21T13:59:07+05:30 IST

రజినీకాంత్ తన పవర్ ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గరా చూపించారు. అతను నటించిన సినిమా 'జైలర్' 10 రోజులు దాటినా ఇంకా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా, ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ రూ. 500 కోట్లు కూడా దాటిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడింతలు లాభాలు తెచ్చిపెట్టింది.

Rajinikanth: బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగుతున్న 'జైలర్' హవా, అన్ని చోట్లా షాకింగ్ కలెక్షన్స్
Rajinikanth from Jailer

రజినీకాంత్ (Rajinikanth) 'జైలర్' #Jailer కి ఎదురులేకుండా అప్రతిహతంగా తన కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతోంది. ఈ సినిమా రెండో వారంలో కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గటం లేదు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 (Rs500 crore club) కోట్లు దాటిన కలెక్షన్, ప్రతి రాష్ట్రంలోనూ రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పది రోజులకి గానూ రూ.40 కోట్ల షేర్ వచ్చింది. అంటే సుమారు రూ.68.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ అన్నమాట. తెలుగులో ఈ సినిమా హక్కులు కొన్న నిర్మాతలకి పండగే పండగ. సుమారు రూ. 12 కోట్లకు తీసుకున్నారని అని వినికిడి, ఇప్పుడు వాళ్ళకి మూడుంతలు ఎక్కువ వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' #BholaaShankar మొత్తం కలెక్షన్స్, రజినీకాంత్ తన సినిమా రెండు రాష్ట్రాల్లోకి వచ్చిన షేర్ తో సమానంగా వున్నాయి.

rajinikanth4.jpg

అంటే రజనీకాంత్ హవా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా కొనసాగుతూనే వుంది. కేరళలో కూడా అలానే వుంది, ఓవర్ సీస్ అయితే అసలు రజినీకాంత్ అరాచకం సృషించారనే చెప్పాలి, అంతలా కలెక్టు చేస్తోంది. అలాగే ఈ సినిమా ఇప్పుడు తమిళ నాడు ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ రూ.500 కోట్లు దాటిపోయింది.

mrpregnant2.jpg

అదీ కాకుండా ఈవారం కూడా పెద్దగా సినిమాలు ఏవీ విడుదల కాకపోవటం ఈ సినిమా కి బాగా అనుకూలించిందనే చెప్పాలి. 'మిష్టర్ ప్రేగ్నంట్' #MrPregnant అనే ఒక చిన్న సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు. సోహెల్ (Sohel) నటన ఈ సినిమాకి ఒక హైలైట్ అవటం, బ్రహ్మాజీ (Brahmaji), అభిషేక్ ఎపిసోడ్ ఇంటర్వెల్ తరువాత నవ్వించటం లాంటి సన్నివేశాలు ఈ సినిమాకి బాగా ఆకర్షణీయంగా మారాయి. ఇక సంతోష్ శోభన్ (SantoshSobhan) కథానాయకుడిగా విడుదలైన 'ప్రేమ్ కుమార్' #PremKumar అనే సినిమా కనీసం ఎవరూ మాట్లాడకుండానే వెళ్ళిపోయింది. ఆ సినిమాకి తగిన ప్రచారాలు లేవు, ఎవరూ ఆ సినిమా గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అన్నట్టుగా విడుదలైంది, వెళ్ళిపోయింది. సంతోష్ శోభన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

Updated Date - 2023-08-21T13:59:07+05:30 IST