సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Punith Rajkumar - Raghavendra: కలకాలం తమ్ముడు గుర్తు.. ఛాతిపై టాటూ

ABN, First Publish Date - 2023-05-31T16:46:35+05:30

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావొస్తున్నా. అభిమానులు, ఆయన కుట్బు సభ్యులు మాత్రం అతని జ్ఞాపకాలను ఇప్పటికీ మరువలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్‌ జరిగా పునీత్‌ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్‌ ప్రస్తావన వచ్చిన ప్రతి చోట కన్నీటి పర్యాంతమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (punith Rajkumar) ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావొస్తున్నా. అభిమానులు, ఆయన కుట్బు సభ్యులు మాత్రం అతని జ్ఞాపకాలను ఇప్పటికీ మరువలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్‌ జరిగిన పునీత్‌ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్‌ ప్రస్తావన (kannada powerstar) వచ్చిన ప్రతి చోట కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఆయన సోదరులు శివరాజ్‌ కుమార్‌(Shiva rajkumar), రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ అయితే పునీత్‌ను చాలా మిస్‌ అవుతున్నారు. ప్రతి సినిమా ఈవెంట్‌లో తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా తన తమ్ముడి పేరును ఛాతీపై టాటూగా వేయించుకున్నారు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌. ఆయనకు పునీత్‌ అంటే చాలా ఇష్టం. వయసులో చిన్నవాడు కావడంతో ఎంతో గారంగా పెంచారు. తమ్ముడే అయినా సొంత బిడ్డలా చూసుకునేవారని కన్నడ ఫ్యాన్స్‌ చెబుతుంటారు. 46 వయసులో 2021 అక్టోబర్‌లో పునీత్‌ గుండె పోటుతో మరణించారు. ఆయన మరణాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయారు. ఏదైనా వేదికపై పునీత్‌ ఫొటో కనిపిస్తే చాలు భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే తమ్ముడిని చిరకాలం గుర్తుంచుకోవడం కోసం తన ఛాతిపై ‘అప్పూ’ అని టాటూ వేయించుకున్నారు. కన్నడలో అందరూ పునీత్‌ను అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్‌ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. ఈ ఫోటోను ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చాయగా నెట్టింట వైరల్ అవుతోంది రాఘవేంద్ర నటుడిగా కొనసాగుతూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. (Tatoo on CHest)

Updated Date - 2023-05-31T16:48:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!