Thalapathy 68: టైటిల్‌పై నిర్మాత క్లారిటీ

ABN , Publish Date - Dec 21 , 2023 | 02:38 PM

విజయ్‌ హీరోగా వెంకట ప్రభు దర్శకత్వంలో ‘దళపతి 68’ (Thalapathy 68 )చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రం టైటిల్‌ విషయంలో కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత అర్చన కల్పతి స్పందించారు.

Thalapathy 68: టైటిల్‌పై నిర్మాత క్లారిటీ

విజయ్‌(Vijay) హీరోగా వెంకట ప్రభు దర్శకత్వంలో ‘దళపతి 68’ (Thalapathy 68 ) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభుదేవా, లైలా, స్నేహ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం టైటిల్‌ విషయంలో కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత అర్చన కల్పతి స్పందించారు.

‘‘దళపతి 68’కు సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో నిజం లేదు. మీరంతా మా సినిమాపై చూపిస్తోన్న అభిమానానికి థ్యాంక్స్‌. వెంకట ప్రభు ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ‘బాస్‌’, ‘పజిల్‌’ అనే టైటిల్స్‌ ఈ సినిమాకు సంబంధించినవి కావు. మా సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకూ వెయిట్‌ చేయండి’ అని ట్వీట్‌ చేశారు ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్‌ అధినేత అర్చన కల్పతి.

స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో విజయ్‌ డ్యూయల్‌ రోల్‌ చేయనున్నారు. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ చిత్రం తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ జరుగుతోంది. ఇక ఇందులో విజయ్‌ వింటేజ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఆ కాలంలో తను ఎలా ఉండేవాడో అచ్చంగా అలాగే కనిపించడానికి ‘డీ ఏజ్‌నింగ్‌ టెక్నాలజీ’ వాడుతున్నారని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది.

Updated Date - Dec 21 , 2023 | 02:38 PM