సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prakruti Mishra: అవకాశాల పేరుతో లోబర్చుకున్నాడు.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడు!

ABN, First Publish Date - 2023-06-10T13:23:46+05:30

ఒడియా హీరోయిన్‌ నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రకృతి మిశ్ర గతంలో ఓసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి గళమెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె మీడియా ముందుకొచ్చారు. నిర్మాత సంజయ్‌ నాయక్‌పై క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడియా హీరోయిన్‌ నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రకృతి మిశ్ర (Prakruti Mishra) గతంలో ఓసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ (Casting Couch) గురించి గళమెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె మీడియా ముందుకొచ్చారు. నిర్మాత సంజయ్‌ నాయక్‌పై (Sanjay Nayak) క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడారు. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి సంజయ్‌ నాయక్‌ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని, అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్‌ రథ్‌ (Jasmine Rath )మద్దతు తెలిపింది. (Sanjay Nayak),

దీనిపై శుక్రవారం నిర్మాత సంజయ్‌ నాయక్‌ (Sanjay Nayak) స్పందించారు. ఇద్దరు హీరోయిన్లు చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్‌ల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే! ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న కక్షతో ప్రకృతి మిశ్రా ఇలాంటి ఆధారం లేని నిందలు వేస్తోందన్నారు. ఆమె తీరు మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ట్రెలికాస్ట్‌ చేసిన మీడియా హౌస్‌లను కోర్టుకు లాగుతానని సవాల్‌ విసిరారు సంజయ్‌ నాయక్‌.

Updated Date - 2023-06-10T13:23:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!