Trisha - NCW : మన్సూర్‌ అలీఖాన్ పై కేసు.. రంగంలో దిగిన ఎన్‌సీడబ్ల్యూ! 

ABN , First Publish Date - 2023-11-20T18:18:33+05:30 IST

చెన్పై బ్యూటీ త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Trisha - NCW : మన్సూర్‌ అలీఖాన్ పై కేసు.. రంగంలో దిగిన ఎన్‌సీడబ్ల్యూ! 

చెన్పై బ్యూటీ త్రిషపై (Trisha) నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor ali khan) చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. (NCW Case) మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని  పేర్కొన్నారు. స్త్రీల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలిపారు. 

‘‘త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై ఐపీసీ సెక్షన్‌ 509బీతోపాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’ అని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది. 

అసలు జరిగింది ఏంటంటే.. తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘లియో’లో త్రిషతో ఓ సీన్‌ గురించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అలీఖాన్‌ అన్నారు. దీనిపై త్రిష కూడా స్సందించారు. అతని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాని, ఇకపై అతనితో నటించేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తుందని, లియో చిత్రంలో అతడితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 


Updated Date - 2023-11-20T18:18:34+05:30 IST