Nassar : నాజర్‌కు పితృవియోగం

ABN , First Publish Date - 2023-10-10T16:13:34+05:30 IST

విలక్షణ నటుడు నాజర్‌కు (Nassar) పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మాబూబ్‌ బాషా (95) (Maaboob basha) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Nassar  : నాజర్‌కు పితృవియోగం

విలక్షణ నటుడు నాజర్‌కు (Nassar) పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మాబూబ్‌ బాషా (95) (Maaboob basha) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నాజర్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. తండ్రి మరణంతో నాజర్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. మాబూబ్‌ బాషా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు.

Updated Date - 2023-10-10T16:13:41+05:30 IST