సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TovinoThomas: మలయాళంలోకి మైత్రి మూవీస్...

ABN, First Publish Date - 2023-07-12T16:32:26+05:30

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మలయాళంలోకి అడుగు పెట్టింది. ఇక్కడ తెలుగులో చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు తీసిన ఈ సంస్థ మలయాళం స్టార్ టోవినో థామస్ కథానాయకుడిగా 'నడికర్ తిలకం' అనే సినిమాతో అక్కడ శ్రీకారం చుట్టింది.

Producer Ravi Shankar with his Malayalam producer Antony
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగులో భారీ, చిన్న సినిమాలతో ముందుకు దూసుకు వెళుతున్న ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) ఇప్పుడు మలయాళంలోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ బాగా పాపులర్ అయిన నటుడు టోవినో థామస్ (TovinoThomas) తో ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లేన్ చేసి, కొచ్చిలో షూటింగ్ కూడా మొదలెట్టేసారు. ఈ సినిమాకి 'నడికర్ తిలకం' (NadikarThilagam) అన్న టైటిల్ కూడా పెట్టారు. మలయాళ స్టార్ టోవినో థామస్‌ ఈమధ్య విడుదలైన సినిమాలు 'మిన్నల్ మురళి', 'తల్లుమల', '2018' చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు.

ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న ఈ 'నడికర్ తిలకం' లో నటిస్తున్నాడు. సంచలన విజయం సాధించిన 'డ్రైవింగ్ లైసెన్స్‌' #DrivingLicence కి దర్శకత్వం వహించిన లాల్ జూనియర్ (LalJunior) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

ఈ ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నారు అని ఒక ప్రకటనలో చెప్పారు. టోవినో థామస్ ఈ చిత్రంలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నారు, కాగా సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన (Bhavana) కథానాయికగా చేస్తోంది.

Updated Date - 2023-07-12T16:33:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!