Vijay 68 : హీరోయిన్ కుదిరిందా?

ABN , First Publish Date - 2023-10-02T14:17:27+05:30 IST

కోలీవుడ్‌ హీరో విజయ్‌ 'లియో’ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తన తదుపరి సినిమాను ప్రారంభించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 68వ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Vijay 68 : హీరోయిన్ కుదిరిందా?

కోలీవుడ్‌ హీరో విజయ్‌(Vijay) 'లియో’(leo) చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తన తదుపరి సినిమాను ప్రారంభించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 68వ సినిమాను (Vijay 68)పూజా కార్యక్రమాలతో మొదలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని సమాచారం. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 3న మొదలుకానుంది. అయితే ఈ చిత్రం గురించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

Meenakshi.gif

ఇందులో విజయ్‌ సరసన మీనాక్షి చౌదరిని (Meenakshi Chowdary) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని పోస్టర్లు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకుంటోన్న మీనాక్షి కోలీవుడ్‌లోనూ బిజీ కానుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. విజయ్‌ నటించిన ‘లియో’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల కానుంది. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్థ్‌ స్వరాలు అందించారు.

Updated Date - 2023-10-02T14:18:34+05:30 IST