scorecardresearch

PonniyinSelvan: అప్పుడు విక్రమ్ కి కూతురుగా వేసిన ఆమె, ఇప్పుడు మణిరత్నం సినిమాలో బాబోయ్...

ABN , First Publish Date - 2023-05-01T12:51:16+05:30 IST

'పొన్నియిన్ సెల్వన్ 2' చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా వేసిన ఆ అమ్మాయి ఎవరని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే మీరే షాక్ అవుతారు...

PonniyinSelvan: అప్పుడు విక్రమ్ కి కూతురుగా వేసిన ఆమె, ఇప్పుడు మణిరత్నం సినిమాలో బాబోయ్...
Vikram and Sara Arjun from Nanna film

మణిరత్నం (ManiRatnam) దర్శకత్వం వచ్చిన చారిత్రాత్మక సినిమా 'పొన్నియిన్ సెల్వన్ 2' (PonniyinSelvan 2) సినిమాలో ఐశ్వర్య రాయ్ (AishwaryaRai) ప్రధాన పాత్ర పోషించింది. ఆమె నందిని పాత్ర వేసింది ఇందులో. అయితే మణిరత్నం చిన్నప్పటి నందిని, చిన్నప్పటి విక్రమ్ గా ఒక అమ్మాయిని, అబ్బాయిని చూపించాడు. చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ వేసిన ఆ అమ్మాయి ఎవరని అందరూ ఆసక్తికరంగా సెర్చ్ చేస్తున్నారంట ఇంటర్నెట్ లో.

saraarjun3.jpg

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, సారా అర్జున్ (SaraArjun). బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ (RajArjun) కుమార్తె ఈ సారా అర్జున్. రాజ్ అర్జున్ చాలా హిందీ సినిమాల్లో వేసాడు, అలాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన తెలుగు సినిమా 'డియర్ కామ్రేడ్' (DearComrade) లో కూడా చేసాడు. ఆ అమ్మాయి సారా అర్జున్ బాలనటిగా చాలా సినిమాలు చేసింది. దర్శకుడు విజయ్ (Director Vijay) దర్శకత్వం చేసిన 'దైవ తిరుమగళ్' (DaivaThirumagal) అనే సినిమాలో సారా చాలా కీలక పాత్రలో నటించింది. ఇదే సినిమా తెలుగులో 'నాన్న' (Nanna) గా వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడు కాగా, అతని ఒక మతిస్థిమితం లేని తండ్రిగా చేస్తే, అతని కూతురిగా సారా అర్జున్ చేసింది.

saraarjun2.jpg

ఇదే సినిమాలో అనుష్క శెట్టి (AnushkaShetty), అమల పాల్ (AmalaPaul) కూడా నటించారు. ఇందులో క్లైమాక్స్ కోర్టు సన్నివేశం లో సారా అర్జున్ ప్రేక్షకులని కంట తడి పెట్టిస్తుంది తన నటనతో. ఆ సారా అర్జున్ ఇప్పుడు పెద్దదయి ఈ మణిరత్నం సినిమాలో చిన్నప్పటి అంటే టీనేజ్ నందిని గా చేసింది. ఈమె పాత్ర చాలా తక్కువే అయినా, మంచి పేరు సంపాదించుకుంది. బాలనటిగా చాలా సినిమాలు చేసింది సారా అర్జున్. అప్పుడు విక్రమ్ కూతురుగా చేసిన ఆమె, ఈ 'పొన్నియిన్ సెల్వం 2' (PonniyinSelvan2) లో చిన్నప్పటి విక్రమ్ కి ప్రియురాలిగా నటించడం విశేషం.

Updated Date - 2023-05-01T12:51:16+05:30 IST