Mammoottty: భయపెట్టనున్న మమ్ముట్టి 'భ్రమయుగం'

ABN , First Publish Date - 2023-08-17T15:10:38+05:30 IST

నిర్మాతలు చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ లు హారర్ సినిమాల మీద వున్న అభిరుచితో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటగా మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి తో 'భ్రమయుగం' సినిమాకి శ్రీకారం చూట్టారు.

Mammoottty: భయపెట్టనున్న మమ్ముట్టి 'భ్రమయుగం'
Mammotty with the producers and director

నిర్మాత చక్రవర్తి రామచంద్ర (ChakravarthyRamachandra) ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈరోజు ప్రారంభమైంది.మొదటి చిత్రమే ఒక సూపర్ స్టార్ తో మొదలెట్టారు. ఈ సినిమాకి 'భ్రమయుగం’ #Bramayugam అనే టైటిల్ ఖరారు చేసి, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) కథానాయకుడిగా షూటింగ్ స్టార్ట్ చేశారు. రాహుల్ సదాశివన్ (RahulSadasivan) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ, ఇది ఒక ఉత్తేజకరమైన చిత్రం. ఇంతకు ముందు నేను ఎప్పుడూ పోషించని ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషిస్తున్నందున ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అని చెప్పారు.

bramayugam1.jpg

రచయిత, దర్శకుడు రాహుల్ సదాశివన్ (RahulSadasivan) మాట్లాడుతూ, తన చిన్నప్పటి కల మమ్ముట్టి గారిని దర్శకత్వం చెయ్యాలని ఆ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. సినిమా ‘భ్రమయుగం’ అనేది కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగేకథ. పప్రంచవ్యా ప్తంగా మమ్ముక్కా అభిమానులకు అలాగే ఈ హర్రర్ ఈ జానర్ ఇష్టపడేవారికి ఇది ఒక ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.

bramayugam2.jpg

నిర్మాత రామచంద్ర 2016 లో వైనాట్ స్టూడియోస్ లో చేరే వరకు ఒక దశాబ్దం పాటు సొంతంగా చిత్ర నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు వైనాట్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు, నిర్మాత ఎస్.శశికాంత్ భాగస్వామ్యంతో చిత్ర నిర్మాణ రంగంలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. గత ఏడు సంవత్సరాలుగా శశికాంత్ రామచంద్ర పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తనకి హారర్ జానర్‌పై ఎంతో అభిరుచి అని, అలాగే తాను ఇంతకు ముందు ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్‌లతో చాలా సంవత్సరాలు వాళ్ళతో పనిచేసిన అనుభవం, అలాగే మనం కూడా ప్రపంచస్థాయి కి తీసిపోని విధంగా చిత్రాలను రూపొందించాలనే తపన ఉండటం వలన, ఈ 'నైట్ షిఫ్ట్ స్టూడియోస్' ని ప్రారంభిమాను చెప్పారు, రామచంద్ర. ఈ ‘భ్రమయుగం’ సినిమా వచ్చే సంవత్సరం ప్రారంభంలో పప్రంచవ్యా ప్తంగా మలయాళం,

తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీభాషల్లో ఏక కాలంలో విడుదల అవుతుంది అని ప్రకటించారు.

Updated Date - 2023-08-17T15:17:52+05:30 IST