Alphonse Puthren: ఫేస్‌బుక్ డీపీని తొలగించి నిరసన తెలిపిన ‘ప్రేమమ్’ డైరెక్టర్

ABN , First Publish Date - 2023-01-23T20:59:37+05:30 IST

‘గోల్డ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఫలితంగా దర్శకుడిని అనేక మంది విమర్శించారు. ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు ఫేస్‌బుక్ డీపీని తొలగించి నిరసన వ్యక్తం చేశాడు. ఇదే విధంగా ట్రోల్స్ వస్తే సోషల్ మీడియా నుంచి వైదొలగుతానని హెచ్చరించాడు.

Alphonse Puthren: ఫేస్‌బుక్ డీపీని తొలగించి నిరసన తెలిపిన ‘ప్రేమమ్’ డైరెక్టర్

సాయిపల్లవి నటించిన ‘ప్రేమమ్’ (Premam) సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీని సంపాదించుకున్న దర్శకుడు అల్ఫోన్స్ పుతేరన్ (Alphonse Puthren). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. అల్ఫోన్స్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత ‘గోల్డ్’ (Gold) చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదలైంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ‘గోల్డ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఫలితంగా దర్శకుడిని అనేక మంది విమర్శించారు. ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు ఫేస్‌బుక్ డీపీని తొలగించి నిరసన వ్యక్తం చేశాడు. ఇదే విధంగా ట్రోల్స్ వస్తే సోషల్ మీడియా నుంచి వైదొలగుతానని హెచ్చరించాడు.

‘‘మీ సంతృప్తి కోసం నన్ను ట్రోల్ చేస్తున్నారు. దూషిస్తున్నారు. నా సినిమా గోల్డ్ గురించి చెత్తగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేయడం మీకు బాగా అనిపిస్తుంది. కానీ, నాకు ఎంత మాత్రం కాదు. నా చిత్రం నచ్చితే చూడండి. కోపాన్ని చూపడానికి మాత్రం నా పేజికి రాకండి. మీరు ఆ విధంగా చేస్తే నేను సోషల్ మీడియా అకౌంట్స్‌ను తొలగిస్తాను. గతంలో మాదిరిగా నేను లేను. నేను అపజయాలు ఎదుర్కొనప్పుడల్లా నా భార్య, పిల్లలు, కొంత మంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. పరాజయాలు ఎదురు కావాలని ఎవరు కొరుకోరు. సహజసిద్ధంగా అది జరుగుతుంది" అని అల్ఫోన్స్ పుతేరన్ పోస్ట్ పెట్టాడు. కామెడీ జోనర్‌లో ‘గోల్డ్’ రూపొందింది. ఈ మూవీకి అల్ఫోన్సే రచయితగా వ్యవహరించాడు. ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో మల్లిక సుకుమారన్, షమ్మీ తిలకన్, బాబురాజ్, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-23T20:59:39+05:30 IST