సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mohanlal Car: మోహన్‌లాల్ మరో కొత్త కారు కొన్నాడండోయ్.. ఈ కారుతో కలిపి మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా..?

ABN, First Publish Date - 2023-04-11T11:19:19+05:30

మార్కెట్ లోకి కొత్త మోడల్ కారు ఏదైనా వస్తే అది మోహన్ లాల్ ఇంట్లో ఉండాల్సిందే. అది మోహన్ లాల్ కి కార్ల మీద వున్న ఫ్యాషన్. ఇప్పుడు తాజాగా మార్కెట్ లోకి వచ్చిన ల్యాండ్ రోవర్ కారు కొన్నాడు మోహన్ లాల్. దాని ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళం సూపర్ స్టార్ (Mohanlal) మోహన్ లాల్ ఒక్క మలయాళం లోనే కాకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ కనపడుతూ ఉంటాడు. అయితే చాలామంది సెలబ్రిటీస్ కి వున్నట్టే మోహన్ లాల్ (Mohanlal) కి కూడా ఏదైనా కొత్త కారు మార్కెట్ లో వస్తే చాలు కొని ఇంట్లో పెట్టేసుకుందాం అనే ఆశకి వుంది. అయితే ఆలా మోహన్ లాల్ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో, అవి కొనడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఈమధ్యనే ఇంకొక లగ్జరీ కారు చాలా ఖరీదైనిది కొన్నాడు మోహన్ లాల్.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'పఠాన్' (Pathaan) విజయం తరువాత 10 కోట్లు పెట్టి రోల్స్ రోయస్ (Rolls-Royce) కారు కొన్నాడని విన్నాం. ఆ స్టార్ లకి ఏమీ తీసిపోకుండా మలయాళం (Malayalam Superstar) సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈమధ్యనే కొన్న కారు ఖరీదు ఎంతో తెలుసా, అక్షరాలా (5) అయిదు కోట్లు. ఇది రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Raver) అంటారట. ఈ కారు కొన్న తరువాత మోహన్ లాల్ ఫ్యాన్ పేజీ లో అభిమానులు ఈ కారుతో పాటు, మోహన్ లాల్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కారుతో సంతోషంగా సెలెబ్రెట్ చేసుకోవటం కూడా పోస్ట్ చేశారు. ఈ కారులో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు.

మోహన్ లాల్ కి ఎంత కార్ల ఫ్యాషన్ అంటే ఇదొక్కటే కాదండీ, మార్కెట్ లోకి ఏదైనా కొత్త కారు వస్తే కొనేస్తూ ఉంటాడు అని అంటున్నారు. 90 లక్షల టొయోట వెల్ ఫైర్ (Toyota Wellfire) కారు కూడా వుంది. అలాగే రూ.1.36 కోట్ల ఖరీదైన టొయోట ల్యాండ్ క్రూజర్ (Toyota Land Cruiser) తో పాటు, రూ.78 లక్షల మెర్సిడెజ్ బెంజ్ (Mercedes Benz GL350) కారు కూడా వుంది. ఇవన్నీ కాకుండా మోహన్ లాల్ దగ్గర రూ.3.15 కోట్లు విలువ చేసే లంబోర్ఘిని ( Lamborghini Urus) కూడా వుంది. ఇలాంటి కారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దగ్గర, బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) ఇంకా ఇంకో నటుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aryan) దగ్గర కూడా ఈ లంబోర్ఘిని వుంది. ఇవన్నీ కాకుండా కుటుంబ సభ్యులు బయటకి వెళ్లి రావడానికి వేరే కార్లు కూడా వున్నాయి. వీటి కోసం మోహన్ లాల్ తన ఇంటి దగ్గర ప్రత్యేక పార్కింగ్ స్పేస్ కూడా కట్టించుకున్నాడు అని అంటారు.

మలయాళం చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ కార్లు అతనికి అవంటే ఎంత ఇష్టమో అందరూ మాట్లాడుకుంటారు. అందుకే పరిశ్రమలో మోహన్ లాల్ స్నేహితులు కారు కొనే ముందు మోహన్ లాల్ ని అడుగుతారా, ఎందుకంటే అతనికి వాటి గురించి బాగా తెలుసు ని కూడా అంటారు.

Updated Date - 2023-04-11T11:19:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!