Kazan Khan : భద్రాచలం విలన్‌ ఇకలేరు!

ABN , First Publish Date - 2023-06-13T15:24:01+05:30 IST

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు కజాన్‌ ఖాన్‌ కన్నుమూశారు. దక్షినాదిలో ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

Kazan Khan : భద్రాచలం విలన్‌ ఇకలేరు!

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నటుడు కజాన్‌ ఖాన్‌ (Kazar khan) కన్నుమూశారు. దక్షినాదిలో ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కేరళలో పుట్టిన కజాన్‌ ఖాన్‌ 1992లో వచ్చిన ‘సెంతమిట్‌ పట్టు’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను తెలుగులో ‘అమ్మకొడుకు’ (Amma koduku) అనే పేరుతో విడుదల చేశారు. 2001లో దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన ‘భద్రాచలం’ (bhadrachalam)సినిమాలో కజాన్‌ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. 2015లో మోహన్‌లాల్‌ హీరోగా వచ్చిన ‘లైలా ఓ లైలా’ చిత్రం ఆయన నటించిన చివరి చిత్రం. కజాన్‌ ఖాన్‌ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. (Rip Kazar khan)

Updated Date - 2023-06-13T15:24:01+05:30 IST