Lokesh Kanagaraju -Leo : ఆ పది నిమిషాల్లో ఏం చెప్పారంటే.. అసలు మిస్‌ కావద్దు!

ABN , First Publish Date - 2023-10-14T19:43:59+05:30 IST

తమిళస్టార్‌ విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘లియో’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.

Lokesh Kanagaraju -Leo : ఆ పది నిమిషాల్లో ఏం చెప్పారంటే.. అసలు మిస్‌ కావద్దు!

తమిళస్టార్‌ విజయ్‌ (Vijay) హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ (lokesh kanagaraju) దర్శకత్వం వహించిన ‘లియో’ (Leo) ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన మంచి జోరు మీదుంది. అమెరికాలో విజయ అభిమానులు కోలాహలం చేస్తున్నారు. కార్లు, బస్సులపై ‘లియో’ పోస్టర్లు అంటించి ర్యాలీ నిర్వహించారు. కేరళలోనూ విజయ్‌ అభిమానులు ఆయన పోస్టర్లతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దర్శకుడు లోకేష్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ‘లియో’ చిత్రం గురించి ఓ విజ్ఞప్తి చేశారు.

Leo.gif

ఈ చిత్రం ప్రారంభం నుంచీ ప్రేక్షకుల్ని అలరిస్తుందని, మొదటి పది నిమిషాలు అసలు మిస్‌ కావద్దని కోరారు. "ఈ చిత్రం కోసం వేయి కంటే ఎక్కువ మంది పనిచేశారు. సంవత్సరం నుంచి వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. అద్భుతమైన అవుట్‌పుట్‌ వచ్చింది. ఎప్పుడూ చూడని సినిమాటిక్‌ అనుభవాన్ని ‘లియో’లో ఎంజాయ్‌ చేయండి. ఈ సినిమాకు మొదటి పది నిమిషాలు చాలా కీలకం అసలు మిస్‌ కావద్దు. సినిమాలో ఆ పది నిమిషాలు ఎంతో ప్రత్యేకం. ఇక విజయ్‌ ఇంట్రడక్షన సీన్స ఒక రేంజ్‌లో ఉంటాయి. అవే సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘విక్రమ్‌’ లాంటి సూపర్‌హిట్‌, ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ‘లియో’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-10-14T19:43:59+05:30 IST