Leo: రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన లియో

ABN , First Publish Date - 2023-10-26T11:17:26+05:30 IST

భారీ అంచనాలతో మోస్ట్ హ్యపనింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో దళపతి విజయ్ (Thalalathy vijay) నటించిన లియో(Leo) చిత్రం విజయదశమికి విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళుతున్నది. సినిమా టాక్ మిశ్రమంగా వచ్చినప్పటికీ కలెక్షన్లు స్టడీగా రాబట్టుతూ 500 కోట్ల క్లబ్ లో చేరింది.

Leo: రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన లియో
leo

భారీ అంచనాలతో మోస్ట్ హ్యపనింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(LokeshKanagaraj) దర్శకత్వంలో దళపతి విజయ్ (Thalalathy vijay) నటించిన లియో(Leo) చిత్రం విజయదశమికి విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకెళుతున్నది. సినిమా టాక్ మిశ్రమంగా వచ్చినప్పటికీ కలెక్షన్లు స్టడీగా రాబట్టుతూ 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఆక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా 4 రోజుల్లో రూ.400 కోట్లు రాబట్టగా ఆరో రోజుకి 500 కోట్ల క్లబ్ లో చేరి అతి తక్కువ సమయంలో అధికంగా డబ్బులు రాబట్టిన తమిళ సినిమాగా రికార్డులకెక్కింది.

తమిళనాట ఈ సినిమాకు పోటీగా వేరే పెద్ద సినిమాలేవి లేకపోవడం బాగా కలిసి రాగా తెలుగులో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ నాలుగు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడిని రాబట్టి లాభాల బాట పట్టింది. ఇంతవరకు ఏ విజయ్ సినిమాకు రాని విధంగా తెలుగులో 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగుకు తోడు లోకేశ్ కనగరాజ్ కు తెలుగునాట ఉన్న క్రేజే దీనికి చాలా ఉపయోగ పడింది. అయితే సోషల్ మీడియా ఎక్స్ లో ఇందుకు విరుద్దంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.


కేవలం 6 రోజుల్లోనే 500 కోట్లు సంపాదించి చిత్రం భారీ విజయం సాధించినట్లు #LeoHits500crores యాస్ ట్యాగ్ ట్రెండ్ చేస్తుండగా మరోవైపు లియో కలెక్షన్లన్నీ ఫేక్ అని సినిమా హిట్ అయిందని చెప్పుకొవడానికి ఫేక్ కలెక్షన్లు చూయిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారంటూ #LeoScam , #LeoDisaster అంటు యాస్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సినిమా అనంతరం లోకేశ్ రజనీకాంత్ 171 సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తదుపరి కార్తితో ఖైదీ 2, కమల్ హసన్ తో విక్రమ్ 2 చేయనున్నారు. ఇక విజయ్ తన తదుపరి68 సినిమాను క్రేజీ డైరెక్టర్ తెలుగులో కస్టడీ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభుతో చేయనుండగా ఇందులో సౌత్ ఇండస్ట్రీలకు చెందిన పెద్ద స్టార్స్ నటించనున్నారు.

Updated Date - 2023-10-26T11:17:26+05:30 IST