Lokesh Kanagaraj : అభిమానుల కోసం తప్పనిసరిగా ప్లాన్  చేస్తాం

ABN , First Publish Date - 2023-10-30T09:17:40+05:30 IST

విజయ్‌ హీరోగా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh Kangaraj) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లియో’(Leo). మొదటిరోజు నెగటివ్‌ టాక్‌ వచ్చినా  సినిమా మాత్రం కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు మినహా ఎలాంటి భారీ ఈవెంట్‌ నిర్వహించలేదు.

Lokesh Kanagaraj :  అభిమానుల కోసం తప్పనిసరిగా ప్లాన్  చేస్తాం

విజయ్‌ హీరోగా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh Kangaraj) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లియో’(Leo). మొదటిరోజు నెగటివ్‌ టాక్‌ వచ్చినా  సినిమా మాత్రం కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు మినహా ఎలాంటి భారీ ఈవెంట్‌ నిర్వహించలేదు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ గ్రాండ్‌గా ఏర్పాటు చేయనున్నారని కోలీవుడ్‌ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై దర్శకుడు లోకేష్‌ స్పందించారు. (Leo Grand Event plans)

‘‘లియో’ సక్సెస్‌ విషయంలో మా టీమ్‌ అంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. విజయ్‌ ఆనందానికైతే అవధుల్లేవు. ఇటీవల కేరళలో ఓ థియేటర్‌ టూర్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల తోపులాటలో నాకు చిన్న గాయమైంది. విషయం తెలిసి విజయ్‌ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమాపై కామెంట్‌ చేసిన అందరికీ సక్సెస్‌, కలెక్షన్ల రూపంలో జవాబు దొరికేసింది. కానీ కొన్ని విషయాలకు దీటైన సమాధానం ఇవ్వాల్సిందే! అందుకే వాటన్నింటికీ సరైన జవాబు చెప్పడానికి త్వరలోనే మీడియా ముందుకు వద్దామనుకుంటున్నా. సెకెండాఫ్‌లో కాస్త నిడివి ఎక్కువైందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ కామెంట్స్‌ని నేను  పాజిటివ్ గా  స్వీకరిస్తున్నా. అభిమానుల కోసం సక్సెస్‌ మీట్‌ పెట్టాలనే ఆలోచనలో మేం ఉన్నాం. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఏ విషయం చెబుతాను’’ అని లోకేశ్‌ కనగరాజ్‌ తెలిపారు.

‘లియో’ సినిమా ప్రమోషన్స్  కోసం టీమ్‌ భారీ ఎత్తున ఏ ఈవెంట్‌ నిర్వహించలేదు. కేవలం ఇంటర్వ్యూలతో మాత్రమే సినిమాను ముందుకు తీసుకెళ్లారు. విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్  ప్లాన్  చేసినా అక్కడ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో అది కూడా రద్దు అయింది. హైదరాబాద్‌లో ప్లాన్  చేయాలనుకున్నారు అది కూడా వర్కవుట్‌ కాలేదు. 

Updated Date - 2023-10-30T09:17:40+05:30 IST