Rajinikanth: కొత్త అప్డేట్ వదిలారు

ABN , First Publish Date - 2023-05-07T20:17:39+05:30 IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గురించి లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ ఇది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సలాం’. రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Rajinikanth: కొత్త అప్డేట్ వదిలారు

‘భాయ్‌ మళ్లీ ముంబై రాబోతున్నాడు!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) గురించి లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ(lyca productions) ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ ఇది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సలాం’. (Lal Salaam)రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 170వ చిత్రమిది. విష్ణు విశాల్‌, జీవిత రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం లైకా సంస్థ ఈ చిత్రం (Look Reveal) గురించి ఆసక్తికర పోస్ట్‌ చేసింది. మే 8న మన భాయ్‌ మళ్లీ ముంబైకి వస్తున్నారంటూ తెలిపింది. ‘‘అర్ధరాత్రి 12గంటలకు ఆయన పేరును రివీల్‌ చేయనున్నాం’’ అని ఆ పోస్ట్‌లో వెల్లడించారు. దాంతోపాటు ఓ పురాతన కట్టడంలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను షేర్‌ చేసింది. ప్రేక్షకులు, తలైవా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘లాలా సలామ్‌’ సినిమా అప్‌డేట్‌ రావడంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. భాయ్‌ పేరు ఏంటోనని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రజినీకాంత్‌ ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం రజినీ కాంత్‌ నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ చిత్రంలో నటిస్తున్నారు. గతేడాది ‘అన్నాతే’ చిత్రంతో నిరాశ పరిచిన రజినీ ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ‘తలైవర్‌ 171’కి కూడా రజినీకాంత్‌ పచ్చ జెండా ఊపారు. లోకేష్‌ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని టాక్‌.

Updated Date - 2023-05-07T20:17:39+05:30 IST