Lokesh Kanakaraj: ఖైదీ-2 సెట్స్‌ మీదకి వెళ్లేది ఎప్పుడంటే!

ABN , First Publish Date - 2023-12-14T11:26:57+05:30 IST

ఖైదీ’, మాస్టర్‌, విక్రమ్‌, లియో వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో దక్షిణాదితోపాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్‌ కనగరాజు(lokesh Kanakaraju). ఇటీవల విజయ్‌ 'లియో'తో భారీ విజయాన్ని అందించాడు.

Lokesh Kanakaraj: ఖైదీ-2 సెట్స్‌ మీదకి వెళ్లేది ఎప్పుడంటే!

‘ఖైదీ’, మాస్టర్‌, విక్రమ్‌, లియో వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో దక్షిణాదితోపాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్‌ కనగరాజు(lokesh Kanakaraju). ఇటీవల విజయ్‌ 'లియో'తో భారీ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ (Rajanikanth) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. నటుడు నరైన్‌ (Sarain) ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. తన కొత్త సినిమా ‘క్వీన్‌ ఎలిజబెత్‌’ ప్రచారంలో భాగంగా చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.

‘ఖైదీ 2’ (Khaidi 2 Update) గురించి అప్‌డేట్‌ ఇవ్వాలని స్టూడెంట్స్‌ కోరగా.. ఆయన ఓ కొత్త విషయాన్ని చెప్పారు. తాను, లోకేశ్‌ కనగరాజ్‌ కలిసి ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’కి సంబంధించి షార్ట్‌ ఫిల్మ్‌ పూర్తిచేశామని చెప్పాడు. అది ‘ఖైదీ’కి ప్రీక్వెల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. 'లోకేష్‌ ప్రస్తుతం రజనీకాంత్‌తో తీయబోయే సినిమా పనుల్లో లోకేశ్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ మొదలవుతుంది’’ అని చెప్పారు. లోకేశ్‌ప్రస్తుతం దర్శకత్వమే కాకుండా నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టారు. జి- స్క్వాడ్‌ నిర్మాణ సంస్థపై ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఫైట్‌ క్లబ్‌’. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - 2023-12-14T11:27:10+05:30 IST