కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kantara Chapter 1: నెత్తుటి దేహం.. ఆవేశం నిండిన చూపు

ABN, First Publish Date - 2023-11-27T13:48:29+05:30

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్  ఇండియా స్థాయిలో విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది

రిషబ్‌శెట్టి (Rishab shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కాంతార’ (Kantara) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్  ఇండియా స్థాయిలో విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఓ సినిమా సిద్థమవుతోన్న విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్రం టైటిల్‌ విడుదల చేశారు.

‘కాంతార ఏ లెజెండ్‌’ (kantara a Legend) అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు’ అంటూ రిషబ్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. నెత్తుటితో తడిచిన దేహం, ఆవేశం నిండిన చూపు, పొడవాటి జుట్టుతో రిషబ్‌ లుక్‌ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. .ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-11-27T14:05:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!