Breaking news: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

ABN , First Publish Date - 2023-02-20T14:01:59+05:30 IST

మొన్న టాలీవుడ్‌లో నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) మరణం.. నిన్న కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ మైల్‌సామీ (Mayilsamy) మృతి.. ఈ రెండు మరణాలు జరిగిన కొన్ని గంటలు కాకముందే..

Breaking news: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

మొన్న టాలీవుడ్‌లో నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) మరణం.. నిన్న కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ మైల్‌సామీ (Mayilsamy) మృతి ఈ రెండు మరణాలు జరిగిన కొన్ని గంటలు కాకముందే.. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్‌కే భగవాన్ (SK Bhagawan) (89) మృతి చెందారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.

భగవాన్ మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. ‘ప్రముఖ దర్శకుడు శ్రీ ఎస్.కె. భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. కన్నడ సినిమాకు దొరై-భగవాన్ జంటగా ఎన్నో మంచి చిత్రాలను అందించారు. ఓం శాంతి’ అని చెప్పుకొచ్చారు. కాగా.. జూలై 5, 1933లో జన్మించిన భగవాన్ చిన్నవయసులోనే హిరన్నయ్య మిత్ర మండలితో కలిసి థియేటర్ నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1956లో కన్నడ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం దర్శకుడిగా మారి అప్పటి స్టార్ హీరో రాజ్‌కుమార్‌తో కలిసి చాలా హిట్ సినిమాలు అందించారు.

ఇది కూడా చదవండి: #RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత

Updated Date - 2023-02-20T14:02:01+05:30 IST