Vedha: శివరాజ్ కుమార్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-01-23T14:02:11+05:30 IST

కన్నడ చలనచిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో శివ రాజ్‌కుమార్ ఒకరు.

Vedha: శివరాజ్ కుమార్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
siva rajkumar

కన్నడ చలనచిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో శివ రాజ్‌కుమార్ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘వేద’. ఈ మూవీ ఆయనకి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 125వ చిత్రం. అంతేకాకుండా.. ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ ఇటీవేల గీతా పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు. ఆ బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. అందుకే ఆయన ఈ చిత్రాన్ని చాలా స్పెషల్‌గా తీసుకున్నారు.

vedha.jpg

ఇటీవలే కన్నడలో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ సూపర్ హిట్ చిత్రం తెలుగులో విడుదలకి సిద్ధమవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా ఆవిష్కరించింది. ఏ.హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఈ మూవీలో శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ కీలకపాత్రల్లో నటించారు.

Updated Date - 2023-01-23T14:02:12+05:30 IST