Sandalwood: చెక్‌బౌన్స్‌ కేసు.. దర్శక నటుడి అరెస్టు

ABN , First Publish Date - 2023-01-14T15:09:10+05:30 IST

చెక్‌బౌన్స్‌ కేసులో ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు గురుప్రసాద్‌ను బెంగళూరు నగర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Sandalwood: చెక్‌బౌన్స్‌ కేసు.. దర్శక నటుడి అరెస్టు
Guruprasad

చెక్‌బౌన్స్‌ కేసులో (Cheque Bounce) ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు గురుప్రసాద్‌ (Guruprasad)ను బెంగళూరు నగర పోలీసులు (Police) శుక్రవారం అరెస్టు చేశారు. గురుప్రసాద్‌ సుదీర్ఘకాలంగా శాండల్‌వుడ్‌ (Sandalwood) రంగంలో ఉన్నారు. 2006లో ఆయన దర్శకత్వం వహించిన మఠ, రెండో చిత్రమైన ఎద్దేళు మంజునాథ విజయం సాధించాయి. రెండు సినిమాలకు పలు పురస్కారాలు దక్కాయి. కాగా.. శ్రీనివాస్‌ అనే వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బుల వ్యవహారం కోర్టుకు చేరింది. గురుప్రసాద్‌ రుణం చెల్లించేందుకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. ఈ మేరకు శ్రీనివాస్‌ కోర్టును ఆశ్రయించారు. నిరంతరంగా విచారణకు గైర్హాజరైన మేరకు గురుప్రసాద్‌పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు గురుప్రసాద్‌ను గిరినగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరచినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-14T15:09:12+05:30 IST