సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pathaan Movie: ‘బేషరమ్ రంగ్’పై విమర్శలు చేసిన ‘కేజీయఫ్’ నటుడు

ABN, First Publish Date - 2023-01-12T15:24:45+05:30

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది.

Pathaan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang) విడుదలైన తర్వాత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ పాటలో దీపికా డ్రెస్‌ అసభ్యంగా ఉండడంతో పాటు డ్యాన్స్ మూమెంట్స్ అసభ్యంగా ఉన్నాయంటూ ఎంతోమంది ప్రముఖులు విమర్శలు చేశారు. తాజాగా ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ సినిమాతో మంచి గుర్తింపు సాధించిన అనంత్ నాగ్ కూడా విమర్శలు చేశాడు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మహిళలను అలా చూపించడం మన భారతీయ సంస్కృతిలో భాగం కాదు. సెన్సార్ బృందం తమ పనిని సరిగ్గా పూర్తి చేసి ఉంటే అసలు ఇలా జరిగేది కాదు. సినిమాల గురించి మరచిపోండి. ఓటీటీ కంటెంట్‌ని చూడండి. అందులో అన్ని రకాల అసహ్యకరమైన, అభ్యంతరకరమైన సీన్లు ఉంటాయి. ప్రతిదీ బహిరంగంగా చేసేస్తున్నారు. వారిని ఆపడానికి ఎవరూ లేరు. ఇండియాలోని పెద్ద, చిన్న స్క్రీన్‌లలో ఇటువంటి నగ్న చిత్రాలను నిలిపివేయాలి. మన సంస్కృతికి, సంప్రదాయాలకు విరుద్ధమైన వాటిని చూపడం వల్ల ప్రజల మధ్య విభేదాలు తలెత్తుతాయి’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-01-12T15:24:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!