Manchu Vishnu: 'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్, భారీగా పెరిగిన అంచనాలు

ABN , First Publish Date - 2023-10-12T16:23:11+05:30 IST

ప్రభాస్, మోహన్ లాల్ తరువాత ఇంకో సూపర్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప' లో నటిస్తున్నారు. అతను మరెవరో కాదు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Manchu Vishnu: 'కన్నప్ప'లో కన్నడ సూపర్ స్టార్, భారీగా పెరిగిన అంచనాలు
Shiva Rajkumar

మంచు విష్ణు (ManchuVishnu) ప్రతిష్టాత్మకంగా నటిస్తూ, నిర్మిస్తున్న భక్తిరస పౌరాణిక చిత్రం 'కన్నప్ప' #Kannappa. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో మొదలైన సంగతి తెలిసిందే. 'మహా భారతం' సిరీస్ కి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ (MukeshKumarSingh) ఈ 'కన్నప్ప' సినిమాకి దర్శకుడు. ఒక్కో భాష నుండి ఒక్కో సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని వార్తలు రావటంతో ఈ సినిమా మీద ఇప్పుడు భారీ అంచనాలు పెరిగాయి.

ఇంతకు ముందే ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు అని ప్రకటించారు. అయితే ప్రభాస్ పక్కన నయనతార (Nayanthara) కూడా నటిస్తోంది అని వార్తలు వచ్చాయి, కానీ ఆ వార్తని చిత్ర నిర్వాహకులు ధ్రువీకరించలేదు. తరువాత మంచు విష్ణు, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ (MohanLal) ని కలిసి అతనితో కలిసి వున్న ఫోటో సాంఘీక మాధ్యమంలో షేర్ చేసి మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు చెప్పారు.

kannappa1.jpg

ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజకుమార్ (ShivaRajkumar) కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనపడనున్నారని వార్త వచ్చింది. ఆసక్తికరం ఏంటి అంటే, శివ రాజకుమార్ తండ్రి కన్నడ పరిశ్రమకి లెజెండరీ నటుడు అయిన దివంగత రాజకుమార్ (Rajkumar) తన మొదటి తెలుగు సినిమా 'కాళహస్తి మహత్యం'లో #KalahastiMahatyam నటించారు. ఇది కూడా కన్నప్ప కథే. ఆ తరువాత చాలా సంవత్సరాల తరువాత అదే సినిమాని 'భక్త కన్నప్ప' #BhaktaKannappa గా రీమేక్ చేసి నటించి నిర్మించారు కృష్ణంరాజు (KrishnamRaju). ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మంచు విష్ణు 'కన్నప్ప' పేరుతో అదే కథతో సినిమా వస్తూ ఉండటం ఆసక్తికరం.

అటువంటి ఈ సినిమాలో రాజ్ కుమార్ తరానికి చెందిన శివ రాజ్ కుమార్, కృష్ణంరాజు తరానికి చెందిన ప్రభాస్ నటించడం ఆసక్తికరం. ఇక ఈ సినిమాలో ముందుగా నుపుర్ సనన్ (NipurSanon) ని కథానాయకురాలుగా ఎంపిక చేశారు, కానీ ఆమె తేదీలు కుదరక ఆమె ఈ సినిమా నుండు తప్పుకుంది. ఆమెకి బదులుగా వేరే నటిని ఇంకా ఎంపిక చేసినట్టు కనిపించలేదు. అలాగే ఈ సినిమాలో తమిళ పరిశ్రమకి చెందిన నటుడు, హిందీ నుండి కూడా కొంతమంది నటులు నటిస్తున్నారని వినికిడి. మోహన్ బాబు (MohanBabu) కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనపడనున్నారని వార్త.

Updated Date - 2023-10-12T16:23:11+05:30 IST