Hariprriya: కనుల పండువగా హీరో, హీరోయిన్ పెళ్లి

ABN , First Publish Date - 2023-01-26T20:42:39+05:30 IST

కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరి ప్రియ (Hariprriya). ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లోను నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహా (Vasishta Simha) ను తాజాగా పెళ్లి చేసుకుంది.

Hariprriya: కనుల పండువగా హీరో, హీరోయిన్ పెళ్లి

కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరి ప్రియ (Hariprriya). ‘పిల్ల జమీందార్’, ‘జై సింహా’ వంటి తెలుగు చిత్రాల్లోను నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహా (Vasishta Simha) ను తాజాగా పెళ్లి చేసుకుంది. ఈ జంట వివాహం మైసూరులో జనవరి 25న కనుల పండువగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు.

కన్నడ నటుడు ధనుంజయ ఈ పెళ్లికి హాజరయ్యాడు. నూతన వధూవరులతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పిక్స్‌లో హరిప్రియ, వశిష్ట సింహా సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను ఈ జంట ఇంత వరకు షేర్ చేయలేదు. గతేడాది డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్‌ను హరిప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నా పేరు చివరన త్వరలోనే సింహా ట్యాగ్ రాబోతుంది. ఈ ట్యాగ్‌తో నేను ప్రేమలో పడిపోయాను. మా రింగ్స్‌లో ఆ పేరు ప్రతిబింబించాలనుకున్నాను. సింహాలతో ఉంగరాలను కస్టమ్ డిజైన్ చేయించాం’’ అని హరిప్రియ చెప్పింది.

Updated Date - 2023-01-26T20:42:41+05:30 IST