KGF 3: పట్టాలపైకి అప్పుడే.. ఐదు భాగాల తర్వాత..

ABN , First Publish Date - 2023-01-08T15:54:45+05:30 IST

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యశ్ (Yash). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

KGF 3: పట్టాలపైకి అప్పుడే.. ఐదు భాగాల తర్వాత..

‘కెజియఫ్’ (KGF) ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు రాకింగ్ స్టార్ యశ్ (Yash). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘కెజియఫ్: చాప్టర్ 2’(KGF: Chapter 2) ఎండ్ కార్డ్స్‌లో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. అప్పటి నుంచి అభిమానులందరు మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరపడినట్టే కనిపిస్తుంది. ‘కెజియఫ్ 3’ (KGF 3) 2025‌లో పట్టాలెక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘కెజియఫ్: చాప్టర్ 3’ (KGF: Chapter 3) 2025 అర్ధభాగం నుంచి మొదలు కాబోతున్నట్టు సమాచారం. ‘కెజియఫ్’ ప్రాంచైజీకీ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ ప్రస్తుతం ‘సలార్’ (Salaar) చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూవీ విడుదల కానుంది. అనంతరం ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయిన తర్వాతనే ‘కెజియఫ్ 3’ పై ప్రశాంత్ నీల్ దృష్టిసారిస్తాడని సమాచారం అందుతుంది. ‘కెజియఫ్ 3’ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘కెజియఫ్’ ను ఐదు భాగాలుగా రూపొందించిన తర్వాత హీరోను కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘కెజియఫ్’ ప్రాంచైజీని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. రెండో భాగం అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపుగా రూ.1400కోట్లను ఈ మూవీ కొల్లగొట్టింది. ‘కెజియఫ్ 2’ లో శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సంజయ్ దత్, రవీనా టండన్, మాళవిక అవినాష్, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-10-27T14:48:37+05:30 IST