Divya Spandana: నటి దివ్య స్పందన మృతి వార్త నిజం కాదు, వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్

ABN , First Publish Date - 2023-09-06T12:36:27+05:30 IST

ప్రముఖ నటి దివ్య స్పందన, లేదా రమ్య ఈరోజు హఠాన్మరణం చెందింది అన్న వార్త అన్ని సాంఘీక మాధ్యమంలో వ్యాపించింది. కానీ ఈ వార్త నిజం కాదని, ఆమె ఆరోగ్యంగా వున్నారని తెలిసింది. దివ్య స్పందన తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది.

Divya Spandana: నటి దివ్య స్పందన మృతి వార్త నిజం కాదు, వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్
Fake news goes viral about Divya Spandana's death

తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించిన ప్రముఖ నటి దివ్య స్పందన హఠాత్తుగా గుండె పోటు తో మరణించారు అనే వార్త దావానంలా వ్యాపించింది. సాంఘీక మాధ్యమంలో ఎవరో పెట్టిన వార్తని వెంటనే అందరూ నిజమనుకొని ఆమె మరరించింది అనే వార్తని కొన్ని మీడియా సంస్థలు కూడా పెట్టేశాయి. అయితే ఆమె ఆరోగ్యంగా, క్షేమంగా వున్నారని, ఆమెకి ఎటువంటి అనారోగ్యం కూడా లేదని, తెలిసింది. కన్నడ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి దివ్య స్పందన ని రమ్య అని కూడా పిలుస్తారు.

divyaspandana1.jpg

తన మొదటి సినిమా నుండే దివ్య స్పందన మంచి పేరు సంపాదించారు. 2003 లో పునీత్ రాజకుమార్ పక్కన 'అభి' అనే సినిమాతో కన్నడ సినిమా లో ఆరంగేట్రం చేశారు దివ్య స్పందనన. తదుపరి సంవత్సరం అంటే 2004 లో తమిళ సినిమా 'కుత్తు' లో నటించింది దివ్య స్పందన, అప్పుడు ఆమె పేరు రమ్య గా మారింది. దివ్య స్పందన పేరు 2013 లో బాగా ప్రఖ్యాతం అయింది, ఆమె 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటక లోని మాండ్య నియోజకవర్గం నుండి పోటీ గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టింది. అయితే ఆ తదుపరి సంవత్సరం అంటే 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.

Updated Date - 2023-09-06T12:37:23+05:30 IST