Silk Smitha: 'సిల్కు మిల్కు' పాటలో సిల్కు స్మితని మరిపించిన ఎస్తర్

ABN , First Publish Date - 2023-09-26T18:53:44+05:30 IST

కన్నడ సినిమా 'ఇనాందార్' లో ఎస్తర్ 'సిల్కు మిల్కు' అనే పాటలో నటించింది. ఆ పాటలో అభినయానికి ఆమెని పాత తరం నటి అయిన సిల్కు స్మిత తో పోలుస్తున్నారు. సిల్క్ స్మిత ఒక ఐకాన్ అని చెప్పింది ఎస్తర్, ఆమెతో నన్ను పోల్చటం...

Silk Smitha: 'సిల్కు మిల్కు' పాటలో సిల్కు స్మితని మరిపించిన ఎస్తర్
Yesteryear actress Smitha and Ester Noronha

ఎస్త‌ర్ నోరోన్హా (EsterNoronha) అన్న పేరు ఇప్పుడు కన్నడ పరిశ్రమలో మారుమోగుతోంది. 'ది వేకంట్ హౌస్' #TheVacantHouse అనే సినిమాలో ఎస్తర్ కథానాయకురాలిగా నటించడమే కాకుండా, ఆ సినిమాకు దర్శకత్వం, సంగీతం, కథ, రచన, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్ డిజైన్, నేపధ్య సంగీతం ఇలా సినిమాకి సంబంధించిన చాలా విభాగాల్లో పని చేసి తాను ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపించుకుంది. ఈ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్ధం అయింది. ఇది ముందుగా కొంకణి, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చెయ్యాలని ఎస్తర్ భావిస్తోంది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమె అవటం ఆసక్తికరం.

inamdaar.jpg

ఇదిలా ఉండగా 'ఇనాందార్' #Inamdar అనే కన్నడ సినిమాలో ఎస్తర్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. 'సిల్కు మిల్కు' #SilkuMilku అని సాగే ఆ పాటలో ఎస్తర్ అద్భుతమైన నాట్య ప్రదర్శన కనపరించింది, ఆ పాట వైరల్ అయింది కూడా. అయితే ఈ పాటలో ఎస్తర్ ని పాత తరం నటి సిల్క్ స్మిత తో పోలుస్తున్నారు. అప్పుడెప్పుడో బాలీవుడ్ నటి విద్యా బాలన్ (VidyaBalan) 'డర్టీ పిక్చర్' #DirtyPicture అనే సినిమాలో సిల్క్ స్మిత పాత్ర ధరించి మంచి పేరు తెచ్చుకుంది, ఇప్పుడు ఒక పాటలో ఎస్తర్ కూడా సిల్క్ స్మిత (SIlkSmitha) లా డాన్స్ చేసి, ఆమెలాగానే డాన్స్ చేసింది అని అందరూ అంటూ వున్నారు.

inamdaar1.jpg

మీరు సిల్క్ స్మిత సినిమాలు చూసారా అని ఎస్తర్ ని అడిగితే, 'చాలా చూసాను' అని సమాధానం చెప్పింది. ఆమె ఒక 'ఐకాన్' అని చెప్పింది. అయితే ఇలా ఆమెతో మిమ్మల్ని పోల్చటం ఎలా భావిస్తున్నారు అన్నదానికి, "నేను గౌరవంగా భావిస్తున్నాను. అయితే నాకు అంతటి పెద్ద నటితో పోల్చడం, నాకు తగిన అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి టైటిల్స్ పెట్టె ముందు నేను చెయ్యాల్సి చాలా వుంది, ఇంకా చాలా కష్టపడాలి," అని చెప్పింది ఎస్తర్. ఇలా ఆమెతో పోల్చటం నా అభిమానులనుండి నాకు వచ్చిన ప్రేమగా భావిస్తాను, అలాగే ఇది ఒక బాధ్యతగా తీసుకొని, ముందు ముందు ఇంకా బాగా కష్టపడతాను అని చెప్పింది ఎస్తర్.

Updated Date - 2023-09-26T18:53:44+05:30 IST