Ester Noronha: ఈసారి మాములుగా దిగడం లేదు.. దాసరి రికార్డ్ కూడా బ్రేక్!

ABN , First Publish Date - 2023-08-03T17:03:22+05:30 IST

అప్పట్లో దాసరి నారాయణ రావు తెలుగు సినిమాలో చాలా శాఖల్లో పని చేసి రికార్డు నెలకొల్పితే, ఇప్పుడు 'భీమవరం బుల్లోడు' లో నటించిన నటి ఎస్తర్ ఒక సినిమాలో లీడ్ యాక్ట్రెస్ తో పాటు ఎన్ని శాఖల్లో పనిచేస్తోందో తెలిస్తే షాకవుతారు మీరు.

Ester Noronha: ఈసారి మాములుగా దిగడం లేదు.. దాసరి రికార్డ్ కూడా బ్రేక్!
Ester Noronha

తెలుగులో దివంగత దాసరి నారాయణరావు (DasariNarayanaRao) గారు ఒక సినిమాకి ఎన్నో శాఖల్లో పని చేసి రికార్డ్ సృష్టించారు. దర్శకత్వం తో పాటు, నటన, పాటలు, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, కథ ఇలా ఒక సినిమాకి ఎన్ని శాఖల్లో పని చెయ్యాలో అన్నిటిలో పని చేసి దాసరి రికార్డు నెలకొల్పారు. అయితే ఒకసారి కాదు అలా ఎన్నో సార్లు చేసి చూపారు అయన. దాసరిలా కొందరు ప్రయత్నాలు చేశారు కానీ దాసరి గారిలా ఎవరు విజయం సాధించలేదనే చెప్పాలి.

EsterNoronha1.jpg

అయితే ఇప్పుడు దాసరి బాటలో ఒక నటీమణి తన సత్తా చూపించాలని అనుకుంది. ఆమె ఎవరో కాదు, ఎస్తర్ (Ester Noronha). దర్శకుడు తేజ (DirectorTeja) సినిమా '1000 అబద్దాలు' #1000Abadhaalu తో లీడ్ యాక్ట్రెస్ గా ఆరంగేట్రం చేసి తరువాత 'భీమవరం బుల్లోడు' #BheemavaramBullodu లో సునీల్ (Sunil) పక్కన చేసి ఆ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్న ఎస్తర్, ఇటు తెలుగులోనూ, అటు కన్నడంలోనూ, అలాగే తమిళంలోనూ బిజీగా సినిమాలు చేస్తూ వుండే నటి. ఈ రెండూ కాకుండా, కొంకణి (KonkaniIndustry) సినిమాలు కూడా చాలా చేస్తోంది ఆమె.

ester1.jpg

ఎస్తర్ ఇప్పుడు ఒక సినిమాకి ఎంతమంది పని చేస్తారో, అన్నీ తానే అయి కొంకణి, కన్నడ భాషల్లో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమా మొదటి లుక్ ఆగష్టు 6 'ఫ్రెండ్ షిప్ డే' (FriendshipDay) రోజు విడుదల చేస్తోంది. ఈ సినిమా టైటిల్ 'ది వేకెంట్ హౌస్' (The Vacant House). ఈ సినిమాలో ఎస్తర్ లీడ్ యాక్ట్రెస్ గా నటిస్తోంది, ఇది ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. నటించడం ఒక్కటే కాకుండా, ఈ సినిమాకి ఎస్తర్ దర్శకత్వంతో (Direction) పాటు, స్క్రీన్ ప్లే (Screenplay), మాటలు (Dialogues) కూడా అందిస్తోంది. ఇవే కాదండీ, ఈ మూవీ కి ఆమె సంగీతం (MusicDirector), నేపధ్య సంగీతం (BackgroundScore) కూడా ఇస్తోంది. అలాగే ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ (CostumeDesigner) గా ఎస్తర్ వర్క్ చేస్తోంది.

ester3.jpg

ఇలా ఒక సినిమాకి ఒకే వ్యక్తి ఇన్ని శాఖల్లో పనిచెయ్యడం బహుశా ఇదే మొదటిసారేమో అని అనిపిస్తోంది. అదీ ఒక అమ్మాయి ఇలా ఇన్ని చెయ్యడం నిజంగా రికార్డు ! వీటన్నితో పాటు ఎస్తర్ మంచి నేపధ్య గాయని (Ester is a playback singer too) కూడా, ఇంతకు ముందు ఎన్నో పాటలు పాడింది ఆమె. ఆమెకి హిందుస్తానీ సంగీతంలో వోకల్స్ ఉస్తాద్ హాఫిజ్ ఖాన్ దగ్గర నేర్చుకుంది. అలాగే కర్ణాటక సంగీతంలో కూడా ప్రవేశం వుంది. ఎస్తర్ 8 ఏళ్ల నుండి పాటలు పాడుతూనే వుంది, అలాగే 14 ఏళ్లకే కొంకణి లో 'ది ఎస్తర్ షో' (TheEsterShow) అని మంగుళూర్ ( Mangaluru) లో చేసింది. అలాగే మ్యూజిక్ ఆల్బం కూడా పదహారేళ్లకు చేసింది. అందులో పాటలు కూడా రాసింది ఎస్తర్. ఇలా ఇంత అనుభవం వున్న ఎస్తర్ ఇప్పుడు ఈ కొంకణి/కన్నడ సినిమాకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, నేపధ్య సంగీతం, గాయని, కాస్ట్యూమ్ డిజైనర్, పాటలు, ఇవన్నీ వెరసి ఇందులో ఆమె లీడ్ యాక్ట్రెస్ గా కూడా నటిస్తోంది. అంటే ఇది ఒక గొప్ప అచీవ్ మెంట్ అని చెప్పాలి.

EsterNoronha2.jpg

అప్పట్లో దాసరి నారాయణరావు గారు ఇలాంటివి అంటే అన్నిటిలో తానే అయి చేసేవారు, ఇప్పుడు నటి ఎస్తర్ ఒక సినిమాకి అన్ని శాఖల్లో తాను పని చేస్తూ ఒక రికార్డు నెలకొల్పబోతోంది. ఈ సినిమాకి నిర్మాత (She is also producer for this film) కూడా ఆమె. ఇంతకు ముందు ఆమె 'సోఫియా - ఎ డ్రీం గర్ల్' #Sophia-ADreamGirl అని ఒక కొంకణా సినిమా తమ సొంత బ్యానర్ లో నిర్మిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు బెస్ట్ రీజినల్ ఫిలింగా 2018లో ఎన్నికయింది. తరువాత 'కంటార్' #Kantaar అనే కొంకణి/ మరాఠీ సినిమా కూడా అదే సొంత బ్యానర్ లో నిర్మించింది. అందులో జాకీ ష్రాఫ్ (JackieShroff) తో పాటు ఎస్తర్ నటించింది. ఇప్పుడు ఈ 'ది వేకెంట్ హౌస్' #TheVacantHouse అనే సినిమా నిర్మించి, చాలా శాఖల్లో ఆమె పని చేస్తోంది.

Updated Date - 2023-08-03T17:03:22+05:30 IST