R. Chandru: ఆ సినిమా చూస్తే తనకు నిద్రకు పట్టలేదంటున్న ‘కబ్జ’ డైరెక్టర్

ABN , First Publish Date - 2023-02-19T20:22:23+05:30 IST

రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోలుగా నటించిన సినిమా ‘కబ్జ’ (Kabzaa). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆర్. చంద్రు (R Chandru) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది.

R. Chandru: ఆ సినిమా చూస్తే తనకు నిద్రకు పట్టలేదంటున్న ‘కబ్జ’ డైరెక్టర్

రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోలుగా నటించిన సినిమా ‘కబ్జ’ (Kabzaa). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆర్. చంద్రు (R Chandru) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా దర్శకుడు ఆర్. చంద్రు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ (Prahanth Neel) తెరకెక్కించిన ‘కెజియఫ్’ (KGF) చిత్రం చూస్తే తనకు నిద్ర పట్టలేదని ఆర్.చంద్రు (R. Chandru) చెప్పారు.

ప్రశాంత్‌ నీల్‌ రెండో మూవీనే భారీగా రూపొందించడంతో తాను ఆశ్చర్యపోయానని చంద్రు తెలిపారు. ‘‘నేను ఇప్పటి వరకు 13 చిత్రాలు తెరకెక్కించాను. ‘కబ్జ’ నా తొలి పాన్‌ ఇండియా మూవీ. అందుకే ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని దర్శకత్వం వహించాను. 1940 నుంచి 1980 మధ్య కాలంలో జరిగే కథ ఇది. ఏ సీన్‌ను కూడా సహజ వాతావరణంలో షూట్ చేయలేదు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని సెట్‌లో చిత్రీకరించాం. ఈ మూవీ ట్రైలర్‌‌ను చూసిన తర్వాత అందరు ‘కెజియఫ్’ తో పోల్చడంతో నాకు చాలా సంతోషం కలిగింది. కానీ, ‘కెజియఫ్’ కు ‘కబ్జ’కు తేడా ఉంది. ప్రతి సినిమాకు సొంత బ్రాండ్‌ ఉంటుంది. అలాంటిదే ఈ ‘కబ్జ’. ఈ చిత్రంలో శ్రియ అద్భుతంగా నటించారు. కిచ్చా సుదీప్‌ ఓ కీలక పాత్రను పోషించారు. రవి బస్రూర్‌ సంగీతం సినిమాకు చాలా బలం. ఏజే షెట్టి కెమెరామెన్‌గా పనిచేశారు’’ అని చంద్రు వివరించారు.

Updated Date - 2023-02-19T20:23:30+05:30 IST