Indian 2: ఇండియ‌న్ 2 అదిరిపోయే అప్డేట్‌.. కీల‌క పాత్ర‌లో బ్ర‌హ్మానందం

ABN , First Publish Date - 2023-10-29T16:02:30+05:30 IST

ఎట్ట‌కేల‌కు ఇండియ‌న్ 2 సినిమా విష‌యంలో క‌ద‌లిక వ‌చ్చింది. అస‌లు సినిమా వ‌స్తుందా రాదా, అస‌లికే ఆగిపోయిందా అన్న అనుమానాలను ప‌టాపంచ‌లు చేస్తూ ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమా విష‌యంలో కీల‌క ఆప్టేట్ ఇచ్చి ఫ్యాన్స్‌, సిని అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పారు. న‌వంబ‌ర్ 3న సినిమా ఇంట్రో గ్లిమ్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Indian 2: ఇండియ‌న్ 2 అదిరిపోయే అప్డేట్‌.. కీల‌క పాత్ర‌లో బ్ర‌హ్మానందం
indian

ఎట్ట‌కేల‌కు ఇండియ‌న్ 2(Indian 2) సినిమా విష‌యంలో క‌ద‌లిక వ‌చ్చింది. అస‌లు సినిమా వ‌స్తుందా రాదా, అస‌లికే ఆగిపోయిందా అన్న అనుమానాలను ప‌టాపంచ‌లు చేస్తూ ద‌ర్శ‌కుడు శంక‌ర్(Shankar) సినిమా విష‌యంలో కీల‌క ఆప్టేట్ ఇచ్చి ఫ్యాన్స్‌, సిని అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పారు. క‌మ‌ల్‌హ‌స‌న్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 3న సినిమా ఇంట్రో గ్లిమ్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే శంక‌ర్ సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలుగు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం పేరును కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఈ సినిమాలో బ్ర‌హ్మనందం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు రావ‌డంతో తెలుగు ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా విడుద‌ల కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

kamal.jpg

25 సంవ‌త్స‌రాల క్రితం 1996లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హ‌స‌న్(Kamal Haasan) హీరోగా వ‌చ్చిన భార‌తీయుడు సినిమా దేశంలో ఏ ర‌కమైన సునామీ సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొన‌సాగింపుగా ఇండియ‌న్ 2 వ‌స్తున్నది. 2015లో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని శంక‌ర్ తెల‌ప‌గా 2017లో దిల్ రాజు నిర్మిస్తున్న‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ భారీ బడ్జెట్ దృష్ట్యా దిల్ రాజు ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో త‌మిళ బ‌డా నిర్మాణ సంస్థ‌ లైకా టేకోవ‌ర్ చేసుకుని చిత్ర నిర్మాణం ప్రారంభించింది.

indian2.jpg

కొంతభాగం చిత్రం షూటింగ్ జ‌రిగిన అనంత‌రం 2020 ఫిభ్ర‌వ‌రిలో సెట్‌లో జ‌రిగిన ఓ అగ్ని ప్ర‌మాదంలో క్రూ మెంబ‌ర్స్ చ‌నిపోవ‌డంతో సినిమా నిర్మాణాన్ని ర‌ద్దు చేశారు. అనంత‌రం కొవిడ్ , లీగ‌ల్, ఓవ‌ర్ బ‌డ్జెట్‌ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో సినిమాను ప‌క్క‌కు పెట్టేశారు. అయితే లైకాకు రెడ్ గేయింట్ సంస్థ కో ప్రొడ్యూస‌ర్‌గా జ‌త క‌ల‌వ‌డంతో 2022 ఆగ‌స్టులో తిరిగి షూటింగ్ ప్రారంభం అయింది.

అప్ప‌టికే ఆ గ్యాప్‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్ దిల్ రాజు (Dil Rju) నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan)తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజ‌ర్‌ (Game Changer)ను ప్ర‌క‌టించ‌డంతో ఇండియ‌న్ 2తో డేట్స్ ఇష్యూ వ‌చ్చి కొంతకాలం అది కొంత‌కాలం ఇది అన్న‌ట్లుగా షూటింగ్ చేస్తుండ‌డంతో సినిమా నిర్మాణం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.


అయితే ఇప్ప‌టికే చిత్రం ఫైన‌ల్ కాఫీ రెడీ అవ‌డంతో సినిమా విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టిస్తారేమోన‌ని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, బ్ర‌హ్మానందం, బాబీ సింహా, ఎస్జే సూర్య, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి గానీ వేస‌వి సెల‌వుల్లో గానీ విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-10-29T16:07:15+05:30 IST