Two Legends : ఒకే స్టూడియోలో.. లెజెండ్స్‌ కలిసిన వేళ!

ABN , First Publish Date - 2023-11-23T16:43:39+05:30 IST

దేశం గర్వించే ఇద్దరు లెజెండ్‌ హీరోలు ఒకే సెట్‌లో కలిస్తే.. (Kamal haasan) అదీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత.. ఈ అరుదైన సంఘటనకు చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియో వేదికైంది. 

Two Legends : ఒకే స్టూడియోలో.. లెజెండ్స్‌ కలిసిన వేళ!


ఒకే స్టూడియోలో.. లెజెండ్స్‌ కలిసిన వేళ! 

దేశం గర్వించే ఇద్దరు లెజెండ్‌ హీరోలు ఒకే సెట్‌లో కలిస్తే.. (Kamal haasan)

అదీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత..

ఈ అరుదైన సంఘటనకు చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియో వేదికైంది. (Rajanikanth)

విశ్వనాయకుడు కమల్‌హాసన్, తలైవా రజనీకాంత్  21 సంవత్సరాల తర్వాత ఒకే సెట్‌లో కలిశారు. కమల్‌ హీరోగా నటిస్తున్న ఇండియన్ -2, రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం షూటింగ్‌ చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోలో వేర్వేరు ఫ్లోర్స్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ స్టార్‌ హీరోలిద్దరూ ఆ స్టూడియోలో కలిశారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా వృత్తిరీత్యా కలవడంతో ఆనందంలో మునిగితేలారు. సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలో నెట్టింట వైరల్‌ అవుతాయి. 

శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. దీనికి సమీపంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో టి.జె. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘తలైవర్ 170’ షూటింగ్ జరుగుతోంది.

kamal-and-rajani.gifతన షూటింగ్ స్పాట్‌కి సమీపంలోనే ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ జరుగుతోందని తెలిసుకున్న రజినీకాంత్.. తన మిత్రుడు కమల్‌హాసన్‌ని షూటింగ్‌ స్పాట్‌లో కలవటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వనటుడు కమల్ హాసన్.. వెంటనే ఉదయం 8 గంటలకే తలైవర్ 170 షూటింగ్ స్పాట్‌కి వెళ్లి ‘నేను నా స్నేహితుడిని కలవడానికి వస్తున్నాను’ అంటూ సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వటం విశేషం. చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను చూసి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండ్రీ యాక్టర్స్ కలుసుకుని వారి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇంతకు ముందు బాబా, పంచ తంత్రం షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగి 21 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్, రెడ్ జెయింట్ మూవీస్ కో ప్రొడ్యూసర్ ఎం. సెంబగ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-11-23T17:18:48+05:30 IST