Kamal Haasan: ఆస్కార్‌ విజేతను కలిసి ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-07-27T17:55:08+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆస్కార్‌ విజేత అమెరికన్‌ మేకప్‌ ఆర్టిస్టు మైఖేల్‌ వెస్ట్‌మోర్‌ను కలిశారు.

Kamal Haasan: ఆస్కార్‌ విజేతను కలిసి ఏం చేశారంటే..

విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆస్కార్‌ విజేత అమెరికన్‌ మేకప్‌ ఆర్టిస్టు మైఖేల్‌ వెస్ట్‌మోర్‌ను కలిశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్‌ రెహమాన్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని ఆస్కార్‌ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడి ఫొటోలను వీక్షించారు. వీరిద్దరూ కలిసి 1972లో విడుదలై ఆస్కార్‌ను సొంతం చేసుకున్న ‘ది గాడ్‌ ఫాదర్‌’ సినిమాను మ్యూజికయంలో చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Kama.jpg

ఏ ఆర్‌ రెహమాన్‌ తనకు ఆస్కార్‌ వచ్చిన ఫొటోను కమల్‌ హాసన్‌కు చూపిస్తోన్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చిత్రంలో నటిస్తున్నారు. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం శంకర్‌ కూడా లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్నారు. అక్కడ ‘లోలా వీఎఫ్‌ఎక్స్‌’ సంస్థలో ‘ఇండియన్‌ -2’ కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించే చర్చల్లో ఉన్నారు.

Kamal-Haasan.jpg

Updated Date - 2023-07-27T17:55:45+05:30 IST