Jailer Success : రజనీకి చెక్కుతోపాటు ఖరీదైన గిఫ్ట్‌

ABN , First Publish Date - 2023-09-01T14:23:58+05:30 IST

రజనీకాంత్‌ ‘జైలర్‌’ హవా ఇంకా కొనసాగుతోంది. చిత్ర బృందం సినిమా సక్సెస్‌ ఆస్వాదిస్తున్నారు. చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ సినిమాకు వస్తోన్న స్పందన పట్ల ఆనందంగా ఉన్న ఆయన కథానాయకుడు రజనీకాంత్‌ కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం తలైవాను ప్రత్యేకంగా కలిశారు. ఆయనకు ఓ చెక్‌ను అందించారు. అంతే కాదు.. మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు.

Jailer Success  : రజనీకి చెక్కుతోపాటు ఖరీదైన గిఫ్ట్‌

రజనీకాంత్‌ ‘జైలర్‌’ హవా ఇంకా కొనసాగుతోంది. చిత్ర బృందం సినిమా సక్సెస్‌ ఆస్వాదిస్తున్నారు. చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ సినిమాకు వస్తోన్న స్పందన పట్ల ఆనందంగా ఉన్న ఆయన కథానాయకుడు రజనీకాంత్‌ కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం తలైవాను ప్రత్యేకంగా కలిశారు. ఆయనకు ఓ చెక్‌ను అందించారు. అంతే కాదు.. మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు. రెండు బీఎండబ్ల్యూ కారులను తీసుకువెళ్లి.. అందులో నచ్చింది సెలెక్ట్‌ చేసుకోవాలని కోరారు. బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్‌ కారును రజనీ సెలెక్ట్‌ చేసుకున్నారు. దాంతో ఆయన కారు తాళాలను రజినీకి అందజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఈ కారు దాదాపు రూ.1.26 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

‘పేట’, ‘అన్నాత్తె’ చిత్రాల తర్వాత కళానిధి మారన్‌, రజనీకాంత్‌ కలిసి చేసిన చిత్రం ‘జైలర్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రం ‘రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడః పండితులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-01T16:32:47+05:30 IST