Rotterdam festival 2024: రోటర్‌డ్యామ్‌ ఫెస్టివల్‌కు రెండు చిత్రాలు!

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:57 AM

‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’ (jigarthanda double x)చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రధారులు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా చక్కని విజయం అందుకుంది.

Rotterdam festival 2024: రోటర్‌డ్యామ్‌ ఫెస్టివల్‌కు రెండు చిత్రాలు!

‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’ (jigarthanda double x)చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రధారులు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా చక్కని విజయం అందుకుంది. క్రైమ్‌ నేపథ్యంలో సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు.. నిజమైన గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌ చిత్రమిది. ఇందులో దర్శకుడిగా సూర్య, గ్యాంగ్‌స్టర్‌గా రాఘవ లారెన్స కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.

తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. రోటర్‌డ్యామ్‌ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ చిత్రం ఎంపికైంది. ఈ విషయాన్ని దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘మా ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్‌’ చిత్రం ప్రతిష్ఠాత్మక రోటర్‌డ్యామ్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో లైమ్‌లైట్‌ కేటగిరీ కింద ప్రదర్శించడానికి ఎంపికైందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

అలాగే అంజలి(Anjali), నివిన్ పాలీ (Nivin pauly) నటించిన 'ఏళు కడై.. ఏళుమలై’ (yezhu kadal yezhu malai) చిత్రం కూడా రోటర్‌డ్యామ్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో బిగ్‌ స్క్రీన్ కేటగిరీలో ప్రదర్శనకు ఎంపికైంది. రామ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ విషయాన్ని అంజలి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.

Updated Date - Dec 22 , 2023 | 10:57 AM