Kamal Haasan: అబుదాబితో అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2023-05-22T16:38:10+05:30 IST

ఆరు దశాబ్ధాలుగా విలక్షణ నటనతో అలరిస్తున్న కమల్‌హాసన్‌ ఖాతాలో మరో అవార్డు చేరనుంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.

Kamal Haasan: అబుదాబితో అరుదైన గౌరవం

ఆరు దశాబ్ధాలుగా విలక్షణ నటనతో అలరిస్తున్న కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఖాతాలో మరో అవార్డు చేరనుంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం (Life time Achivement award) అందుకోనున్నారు. ఈ నెల 27న అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో (IIFA 2023) ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. విశ్వనాయకుడిగా కమల్‌ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడీ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడంతో అభిమానులు హర్షిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కమల్‌హాసన్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ (indian2)షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కమల్‌ ఆయన పాత్రకు సంబంధించిన పలు సన్నివేశాలకు డబ్బింగ్‌ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయికలుగా నటిస్తున్నారు.

Updated Date - 2023-05-22T16:40:03+05:30 IST