KGF 3: హోంబలే అప్‌డేట్‌ వచ్చింది!

ABN , First Publish Date - 2023-04-14T15:07:46+05:30 IST

కన్నడ చిత్రం ‘కేజీయఫ్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! గత ఏడాది రిలీజ్‌ అయినా ‘కేజీఎఫ్‌-2’ కూడా బాక్సాపీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

KGF 3: హోంబలే అప్‌డేట్‌ వచ్చింది!

కన్నడ చిత్రం ‘కేజీయఫ్‌’ (KGF-3) చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! గత ఏడాది రిలీజ్‌ అయినా ‘కేజీఎఫ్‌-2’ (KGF2) కూడా బాక్సాపీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో యశ్‌ (yash) ఓ బ్రాండ్‌గా మారారు. కేజీఎప్‌-2 విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ ఓ ప్రత్యేక వీడియో షేర్‌ చేసింది. ‘రాకీభాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు..? ’అంటూ విడుదలైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘కేజీఎఫ్‌’ సినిమా మా టీమ్‌ అందరికీ ఓ ఎపిక్‌ జర్నీ. కోట్లది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టింది’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు త్వరలో ‘కేజీయఫ్‌3’ మొదలవుతుందనే హింట్‌ ఇచ్చారంటూ యశ్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘కేజీయఫ్‌’ రెండు పార్టులు ఘన విజయం సూపర్‌ హిట్‌గా నిలవడంతో మూడో భాగం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాప్టర్‌ 3లో (KGF3) యశ్‌ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎలా చూపించనున్నారోనని చర్చ మొదలుపెట్టారు. (Prasanth neel)

అయితే ఇప్పటికీ యశ్‌ కేజీఎఫ్‌ లుక్‌లోనే మెయిన్‌టెన్‌ చేస్తున్నారు. ఇటీవల ఆయన ఓ యాడ్‌లో కనిపించారు. అందులో కూడా రాకీభాయ్‌ కేజీఎఫ్‌ లుక్‌లోనే కనిపించారు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘సలార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కంప్లీట్‌ చేశాక ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఉంది. ఆ తర్వాతే ‘కేజీయఫ్‌3’ మొదలయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-14T15:44:27+05:30 IST