Ponniyin Selvan: తమిళ నిర్మాత లైకా ప్రొడక్షన్ కంపెనీ మీద ఈడీ దాడులు

ABN , First Publish Date - 2023-05-16T12:23:54+05:30 IST

తమిళం లో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ లాంటి అగ్రనటులతో పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే లైకా ప్రొడక్షన్స్ సంస్థ కి చెందిన సుమారు ఎనిమిది ఆఫీసుల మీద ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా

Ponniyin Selvan: తమిళ నిర్మాత లైకా ప్రొడక్షన్ కంపెనీ మీద ఈడీ దాడులు

తమిళనాడు చలన చిత్ర పరిశ్రమలో లైకా ప్రొడక్షన్ (LycaProductions) కంపెనీ చాలా భారీ బడ్జెట్ సినిమాలు తీసే కంపెనీ గా ప్రసిద్ధి చెందింది. ఈమధ్యనే విడుదల అయిన 'పొన్నియిన్ సెల్వన్' (PonniyinSelvan), అలాగే అదే సినిమా రెండో భాగం 'పొన్నియిన్ సెల్వన్ 2' (PS 2) కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిచిన సినిమాలే. ఈ రెండు సినిమాలకి మణిరత్నం (ManiRatnam) దర్శకుడు కాగా, ఈ రెండు పెద్ద హిట్ అయ్యాయని ఆ సినిమా నిర్వాహకులు చెప్పారు. ఈ లైకా ప్రొడక్షన్ హౌస్ కి అధినేత సుబాస్కరన్ (SubaskaranAllirajah), ఇతను ఎక్కువగా లండన్ లో ఉంటాడు అని అంటారు.

ps2review4.jpg

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఈ కంపెనీ మీద ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా జాతీయ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. చెన్నై లో వున్న లైకా ప్రొడక్షన్ #LycaProductions ఆఫీసులు అన్నిటి మీదా ఒకేసారి ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇంకా తనికీలు కొనసాగుతున్నాయని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని కూడా అధికారులు అంటున్నట్టుగా తెలిసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ మీద ఈడి (ED) మనీ లాండరింగ్ (MoneyLaundering) కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది.

aishwaryarajinikanth.jpg

రాబోయే రోజుల్లో లైకా ప్రొడక్షన్స్ చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ లో తీస్తున్నాయి. అందులో ఒకటి 'లాల్ సలాం' (LalSalaam), ఇందులో రజనీకాంత్ (Rajinikanth) ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య (AishwaryaRajinikanth) ఈ సినిమాకి దర్శకురాలు. ఇందులో విక్రాంత్, విష్ణు విశాల్ కూడా నటిస్తున్నారు. ఇది కాకుండా ఇంకో అగ్ర నటుడు కమల్ హాసన్ (KamalHaasan) తో 'ఇండియన్ 2' (Indian 2) అనే ఇంకో పెద్ద బడ్జెట్ సినిమా కూడా నిర్మాణంలో వుంది. దీనికి శంకర్ (Shankar) దర్శకుడు కాగా, ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAgarwal), రకుల్ ప్రీత్ సింగ్ (RakulPreetSingh) కథానాయికలు. ఈ రెండే కాకుండా ఇంకో అగ్ర నటుడు 'అజిత్' (Ajith) తో కూడా సినిమా నిర్మాణం లో వుంది, అలాగే ఇంకో తమిళ సినిమా కూడా వుంది.

Updated Date - 2023-05-16T12:23:54+05:30 IST