Rajinikanth: తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు...దుష్ప్రచారం ఆపండి!

ABN , First Publish Date - 2023-05-19T13:58:13+05:30 IST

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గురించి దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Rajinikanth: తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు...దుష్ప్రచారం ఆపండి!

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) గురించి దర్శకుడు మిస్కిన్‌ (Mysskin Comments) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 170కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మరికొన్ని రోజుల్లో చిత్ర పరిశ్రమకు బై బై చెప్పనున్నారట. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్త. తాజాగా తమిళ దర్శకుడు మిస్కిన్‌ రజినీపై చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా నిలిచాయి. తాజా ఇంటర్వ్యూలో ‘‘లోకేశ్‌ కనకరాజ్‌ (lokesh Kanagaraju) దర్శకత్వంలో నటించాలని రజినీకాంత్‌ ఆసక్తిగా ఉన్నారు. ఆయనే లోకేశ్‌ ను స్వయంగా ఈ సినిమా గురించి అడిగారు. బహుశా ఇదే రజనీకాంత్‌కు చివరి సినిమా కావచ్చు. ఆ తర్వాత ఆయన సినిమాలకు విరాయం తీసుకోబోతున్నారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు’ అని ఓ నెటిజన్‌ అంటే.. ‘రజనీకాంత్‌ పై ఇలాంటి ప్రచారాలు ఆపండి’ అని మరో అబి?మాని విజ్ఞప్తి చేశారు. కొందరు నెటిజన్లు అయితే మిస్కన్‌ను సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆట ఆడేసుకుంటున్నారు. (Rajanikanth 170)

అయితే రజినీకాంత్‌పై ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. ‘బాబా’ సినిమా వచ్చిన సమయంలోనూ ఆయన ఇక తెరపై కనిపించరనే వార్తలు ప్రసరామయ్యాయి. అప్పుడు మూడేళ్లు విరామం తర్వాత 2005లో ‘చంద్రముఖి’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మిస్కిన్‌ వ్యాఖ్యలతో మరోసారి రజనీ చివరి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన ‘జైలర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. తదుపరి ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ‘లాల్‌ సలాం’ చిత్రంతో బిజీ కానున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ఇందులో రజినీకాంత్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా నటిస్తున్నారు. అలాగే లోకేశ్‌ కనకరాజ్‌తో కూడా ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-05-19T13:58:13+05:30 IST