Ilaiyaraaja biopic : హీరో అతనేనా.. నెట్టింట వైరల్‌!

ABN , First Publish Date - 2023-10-31T12:45:21+05:30 IST

ఇసైజ్ఞాని ఇళయరాజాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆయన జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ రానుందనే వార్త కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఇదేవార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన వ్యక్తిగత, సంగీత జీవితాన్ని కథగా మలిచి సినిమాగా తీయాలనే ఆలోచన బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌ బాల్కీకి తట్టింది.

Ilaiyaraaja biopic : హీరో అతనేనా.. నెట్టింట వైరల్‌!

ఇసైజ్ఞాని ఇళయరాజాకు (Ilaiyaraaja) సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆయన జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ రానుందనే వార్త కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఇదేవార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన వ్యక్తిగత, సంగీత జీవితాన్ని కథగా మలిచి సినిమాగా తీయాలనే ఆలోచన బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌ బాల్కీకి (R balki) తట్టింది. ఈ విషయాన్ని ఏడాడి క్రితం ఓ సందర్భంలో వెల్లడించారు. ఇళయరాజా ((Ilaiyaraaja Biopic) పాత్రలో ధనుష్‌ని చూడాలనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీని పట్ల ధనుష్‌ (Dhanush) కూడా ఆసక్తికరంగా ఉన్నట్లు సమాచారం.

Untitled-2.jpg

ఇళయరాజా పాత్ర చేయడానికి ధనుష్‌ సై అన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కోలీవుడ్‌ మీడియా కూడా దీనిపై పలు కథనాల రాసుకొచ్చింది. అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుందని, 2025లో సినిమాను విడుదల చేసే ప్లానలో ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. కనెక్ట్‌ మీడియా ప్రొడక్షన హౌస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆలోచన బయటపెట్టిన ఆర్‌.బాల్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేక మరెవరైనా దర్శకుడు ప్లానలోకి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గతంలో ఆర్‌ బాల్కీ ధనుష్‌తో షమితాబ్‌ చిత్రం తీసిన సంగతి తెలిసిందే! అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే!

Updated Date - 2023-10-31T12:51:11+05:30 IST