Ilaiyaraaja Biopic : కథ ఖరారైంది.. ధనుష్‌ ఫిక్స్‌

ABN , First Publish Date - 2023-11-11T10:22:08+05:30 IST

సంగీత జ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుందనే వార్త చాలా రోజులుగా హల్‌చల్‌ చేస్తోంది. ధనుష్‌ (Dhanush) ఇళయరాజా పాత్ర పోషిస్తారని, బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌.బాల్కీ (R balki) దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం తమిళస్టార్‌ హీరో ధనుష్‌ ఇళయరాజాగా తెరపై సందడి చేయనున్నారు.

Ilaiyaraaja Biopic : కథ ఖరారైంది.. ధనుష్‌ ఫిక్స్‌

సంగీత జ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుందనే వార్త చాలా రోజులుగా హల్‌చల్‌ చేస్తోంది. ధనుష్‌ (Dhanush) ఇళయరాజా పాత్ర పోషిస్తారని, బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌.బాల్కీ (R balki) దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం తమిళస్టార్‌ హీరో ధనుష్‌ ఇళయరాజాగా తెరపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు కనెక్ట్‌ మీడియా, మెర్క్యూరీ గ్రూప్‌ సంస్థలు వెల్లడించాయి. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో  సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఇళయరాజాపై సినిమా రానుండటం సంగీతాభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ ఏడాదిలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. (Ilaiyaraaja

Biopic)

ఇక నిర్మాణ సంస్థల విషయానికొస్తే రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్‌ చిత్రాలను కనెక్ట్‌ మీడియా, మెర్క్యూరీ గ్రూప్‌ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సౌత్‌ సినీ ఇండస్ర్టీని దృష్టిలో ఉంచుకుని కనెక్ట్‌ మీడియా సహకారంతో మెర్క్యురీ మూవీస్‌ అనే ప్రత్యేక యూనిట్‌ను మెర్క్యురీ గ్రూప్‌ ఇండియా ఆవిష్కరించింది. సరికొత్త సినిమాలను, కంటెంట్‌ను అందించేందుకు సిద్దమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమ సంవత్సరానికి 900 కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్‌ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. కంటెంట్‌ సృష్టి పరంగా అగ్రగామిగా ఉంది.

కనెక్ట్‌ మీడియా వరుణ్‌ మాథుర్‌ మాట్లాడుతూ, ‘‘మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్థి చెందిన పేర్లలో ఒకటి. మెగా-బడ్జెట్‌ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం భారతీయ వినోద పరిశ్రమ కీలక పరిణామ దశలో ఉంది. రాబోయే రెండు దశాబ్దాలు ఇది మరింత అభివృద్థి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస?్తం’’ అన్నారు.

మెర్క్యూరీ గ్రూప్‌ సీఈవో, ఎండీ శ్రీరామ్‌ శక్తిశరణ్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రాంతీయ కథలకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది. ప్రాంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థ్థాయిలో గుర్తింపు లభిస్తోంది’’ అని అన్నారు.

Updated Date - 2023-11-11T10:22:10+05:30 IST