ChiyanVikram: దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి ధీటైన జవాబిచ్చిన చియాన్ విక్రమ్

ABN , First Publish Date - 2023-05-22T18:56:26+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ నటుడు చియాన్ విక్రమ్ ల మధ్య కొంచెం సమాచారం లోపం ఏర్పడింది అని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అతను విక్రమ్ ను దృష్టిలో పెట్టుకునే 'కెన్నెడీ' సినిమా కథ రాసాని చెప్పాడు, అందుకు విక్రమ్ స్పందించలేదు అందుకే రాహుల్ భట్ తో చేశాయి అని చెప్పాడు. దానికి విక్రమ్ మీరు పంపిమ ఈమెయిల్ ఐడి యాక్టివ్ లేదు, అలాగే ఫోన్ నెంబర్ రెండు సంవత్సరాల క్రితం చేంజ్ చేశా, అందుకే మీ మెసేజ్ రాలేదు అని చెప్పాడు

ChiyanVikram: దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి ధీటైన జవాబిచ్చిన చియాన్ విక్రమ్
Anurag Kashyap and Chiyaan Vikram

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (AnuragKashyap) తన సినిమా 'కెన్నడీ' (Kennedy) లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (CannesFilmFestival) లో పాల్గొన్నారు. #2023CannesFilmFestival అక్కడ మీడియా తో మాట్లాడుతూ ఈ 'కెన్నడీ' #Kennedy సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర సంఘటనలను చెప్పారు. అందులో మొదట ఈ కథను తమిళ నటుడు చియాన్ విక్రమ్ (ChiyaanVikram) ను దృష్టిలో పెట్టుకొని రాసాను అని చెప్పాడు. ఎందుకంటే చియాన్ విక్రమ్ అసలు పేరు కెన్నడీ (Kennedy) అని, అందుకే ఈ సినిమాకి 'కెన్నడీ' అన్న టైటిల్ ని కూడా పెట్టాను అని చెప్పాడు అనురాగ్. అయితే విక్రమ్ కి వెళ్లి కథ వినిపించాను అని, అతను పూర్తిగా కథ విన్నాక ఏమి చెప్పలేదని, అతని స్పందన తెలియచెయ్యలేదని చెప్పాడు అనురాగ్ కశ్యప్.

anuragkashyap1.jpg

ఆ తరువాత రాహుల్ భట్ (RahulBhatt) ని కలిసి ఈ కథ చెప్పినప్పుడు, అతను చాలా ఆసక్తిగా విన్నాడని, కథ విన్నాక ఎవరు చేస్తున్నారని అడిగాడని, మీకు కథ నచ్చితే మీరు చేస్తే ఒకే అన్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వస్తుందని కూడా చెప్పానని, అందుకు రాహుల్ ఒప్పుకున్నాడు అని, ఈ సినిమా చేసినప్పుడు వేరే సినిమాలు చెయ్యకుండా 'కెన్నడీ' లో పాత్ర కోసమే చాలా కష్టపడ్డాడు అని చెప్పాడు అనురాగ్ కశ్యప్ ఆ సినిమా గురించి.

అయితే చియాన్ విక్రమ్ ఇప్పుడు అనురాగ్ కశ్యప్ చెప్పిన దానికి స్పందించాడు. తన ట్విట్టర్లో అనురాగ్ ను విద్దేశించి ఒక ట్వీట్ చేసాడు.

chiyaanvikram3.jpg

"మనమధ్య ఒక సంవత్సరం క్రితం జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో వున్న మన స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం మళ్ళీ ఇక్కడ ఇస్తున్నా. ఈ చిత్రం కోసం మీరు నన్ను సంప్రదించడానికి ప్రయత్నించారని, నేను మీకు స్పందించలేదని మీరు భావించారని మరొక నటుడి ద్వారా నేను విన్నప్పుడు, నేను వెంటనే మీకు కాల్ చేసాను, కానీ మీ నుండి నాకు ఈమెయిల్ గానీ మెసేజ్ గానీ రాలేదు. ఎందుకంటే మీరు పంపిన ఈమెయిల్ యాక్టివ్‌గా లేదు, అలాగే దాదాపు రెండు సంవత్సరాల క్రితమే నా ఫోన్ నంబర్ కూడా మారిపోయింది. నేను మీకు ఫోన్ కాల్ చేసిన సమయంలో నేను చెప్పినట్లు, మీ 'కెన్నడీ' సినిమా కోసం నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను ఎందుకంటే దానికి నా పేరు ఉంది కాబట్టి. మీకు ముందు ముందు మంచి జరగాలని కోరుకుంటూ, ప్రేమతో, చియాన్ విక్రమ్ (ChiyaanVikram), కెన్నడీ" అని ఒక ట్వీట్ చేసాడు విక్రమ్.

ఇక దీనితో ఈ ఇద్దరి మధ్య ఈ సినిమా గురించి వున్నా భేదాభిప్రాయాలు తొలగిపోతాయని అందరూ అనుకుంటున్నారు.

Updated Date - 2023-05-22T18:56:26+05:30 IST