RIP Vijayakanth: విజయకాంత్ మరణం.. ప్రముఖులు ఏమన్నారంటే..!

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:37 PM

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యం గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  విజయకాంత్‌ అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.

RIP Vijayakanth: విజయకాంత్ మరణం.. ప్రముఖులు ఏమన్నారంటే..!

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) అనారోగ్యం గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  విజయకాంత్‌ అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం సంతాప దినంగా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో షోలను రద్దుచేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు విజయకాంత్  మరణం పట్ల సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. (Homage to Vijaykanth)

"ప్రధాని మోదీ (Modi) విజయకాంత్‌ మరణం చాలా బాధాకరమని ట్వీట్ చేసారు. విజయకాంత్‌ మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనొక లెజెండ్‌. తన అభినయంతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో ఉన్నారు. తమిళనాడు రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్‌కాంత్ తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

"హీరో, డీఎండీకే అధినేత విజయ్‌ కాంత్‌ మృతి బాధాకరం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అకాల మరణం ఒక్క కోలీవుడ్‌కే కాదు యావత్‌ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు. 'ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన విజయ్‌ కాంత్‌ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానుల్ని సంపాదిచుకున్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు" 

-  బాలకృష్ణ (Balakrishna)

"సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విజయకాంత్‌ మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగారు. నిర్భయం, ధైర్యం అతడిలో గొప్ప లక్షణాలు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. విజయకాంత్‌ జ్ఞాపకాల్లో చిరస్థ్థాయిగా నిలిచిపోతారు’’

- నటుడు కమల్‌ హాసన్‌(Kamal haasan)

విజయకాంత్‌గారి మరణ వార్త బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయన ఓ పవర్‌హౌస్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

- ఎన్టీఆర్‌

విజయకాంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. కెప్టెన్‌గా ఎంతోమంది హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా

- ఖుష్బూ

మనసున్న మనిషి. మహానుభావుడు. విజయకాంత్‌ ఇకలేరన్న నిజాన్ని నమ్మడం కష్టంగా ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చేసుకుంటున్నాను

- రచయిత పరుచూరి గోపాలకృష్ణ

కెప్టెన్‌ ఆత్మకు శాంతి కలగాలి. ఆయనతో నాకున్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి

-త్రిష

Updated Date - Dec 28 , 2023 | 02:00 PM