Andrea Jeremiah: క్యారెక్టర్‌ డిమాండ్‌ చేయడంతో అలా..!

ABN , First Publish Date - 2023-08-15T14:24:09+05:30 IST

నటిగా, సింగర్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు ఆండ్రియా. తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్‌ కుటుంబంలో పుట్టిన ఆమె లా చదివారు. బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో మంచి గుర్తింపు పొందారు. ‘పుష్ప’ చిత్రం తమిళ వెర్షన్‌లో ‘ఊ అంటావా మావ’ పాట పాడి అలరించారు.

Andrea Jeremiah: క్యారెక్టర్‌ డిమాండ్‌ చేయడంతో అలా..!

నటిగా, సింగర్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు ఆండ్రియా(Andrea Jeremiah). తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్‌ కుటుంబంలో పుట్టిన ఆమె లా చదివారు. బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో మంచి గుర్తింపు పొందారు. ‘పుష్ప’ (Pushpa) చిత్రం తమిళ వెర్షన్‌లో ‘ఊ అంటావా మావ’ పాట పాడి అలరించారు. ఆ పాటతో ఆమె మరో రేంజ్‌కి చేరింది. ప్రస్తుతం ఈమెపై విపరీతంగా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఆండ్రియా డైరక్టర్‌ వెట్రిమారన్‌ నిర్మించిన ‘అనల్‌ మేల్‌ పణితులి’ సినిమాలో నగ్నంగా నటించి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైందీ చిత్రం.

తాజాగా ఓ వేదికపై ఆండ్రియాకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ‘‘అవును నిజంగానే ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో నగ్నంగా నటించింది. ఆ సమయంలో నిజంగా సిగ్గుపడ్డాను. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేసినప్పుడు అర్ధ నగ్నంగా నటించడంలో తప్పేముంది. నిజ జీవితంలో నేను ఇంతకంటే ఎక్కువ సమస్యలే ఎదుర్కొన్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఆండ్రియా ‘పిశాచి 2’, ‘మాలిగై’, ‘నో ఎంట్రీ’, ‘బాబీ’ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్‌’లో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

Updated Date - 2023-08-15T14:24:09+05:30 IST