Ajith Bike: ఒక జర్నీ పూర్తయింది.. నవంబర్‌లో వరల్డ్‌ టూర్‌!

ABN , First Publish Date - 2023-05-11T12:16:49+05:30 IST

కోలీవుడ్‌ అగ్ర నటుడు అజిత్‌కుమార్‌(Ajith kumar) కు బైక్‌ రైడింగ్‌ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే! ఆయనకు గ్యాప్‌ దొరికింది అంటే ఫ్యామిలీతో గడపడంతోపాటు సరదాగా బైక్‌ రైడ్‌కి వెళ్తుంటారు.

Ajith Bike: ఒక జర్నీ పూర్తయింది.. నవంబర్‌లో వరల్డ్‌ టూర్‌!

కోలీవుడ్‌ అగ్ర నటుడు అజిత్‌కుమార్‌(Ajith kumar) కు బైక్‌ రైడింగ్‌ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే! ఆయనకు గ్యాప్‌ దొరికింది అంటే ఫ్యామిలీతో గడపడంతోపాటు సరదాగా బైక్‌ రైడ్‌కి వెళ్తుంటారు. గతేడాది సెప్టెంబర్‌లో బైక్‌ టూర్‌ వేశారాయన. డిసెంబర్‌ నెలాఖరుకు దేశంలోని అన్ని రాష్ట్రాలను (world tour on Bike) చుట్టేశారు. ఆ జర్నీ మొత్తం ఫొటోల రూపంలో నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ మధ్యనే ఆయన మరో టూర్‌ వేశారు. దానికి మొదటి అడుగుగా మూడు దేశాలను ఆ చుట్టేశారు. ఇండియా, నేపాల్‌, భూటాన్‌ ప్రాంతాలను తిరిగినట్లు అజిత్‌ మేనేజర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. త్వరలోనే ఈ ట్రిప్‌ పూర్తి చేసుకుని చెన్నై తిరిగి రానున్నారని పేర్కొన్నారు. తదుపరి మరో వరల్డ్‌ టూర్‌ కూడా ప్లాన్‌ చేశారని వెల్లడించారు. (Ajith motorbike ride)‘‘అజిత్‌కుమార్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే ప్యాషన్‌. ప్రస్తుతం ఆయన భుటాన్‌, నేపాల్‌ దేశాల్లో బైక్‌ రెడింగ్‌ చేస్తూ వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ బైక్‌ రైడింగ్‌ సవాల్‌తో కూడినది. ఇప్పుడున్న వాతావరణం, ప్రతికూల పరిస్థితుల ఎదుర్కొని అజిత్‌కుమార్‌ స్వదేశీ పర్యటన చేశారన్నారు. నేపాల్‌, భూటాన్‌ దేశాల పర్యటన పూర్తి చేసుకుని తదుపరి వరల్ట్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ టూర్‌ ఉంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బైక్‌ మీద అంత జర్నీ అంటే మాములూ విషయం కాదు. వరల్డ్‌ టూర్‌ బైక్‌ మీద చేయడం అంటే పెద్ద సాహసమే’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Untitled-1.jpg

ప్రస్తుతం అజిత్‌ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థల ఓ సినిమా చేయబోతున్నారు. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి ‘విడా ముయర్చి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనిరుద్‌ సంగితాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను జూన్‌ నెలలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం అజిత్‌ 70 రోజ్చుజీ కాల్‌షీట్స్‌ కేటాయించినట్లు, ఆలోగా ఆయనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలంటూ నిబంధన పెట్టినట్లు టాక్‌ వినిపిస్తోంది.

Updated Date - 2023-05-11T12:24:46+05:30 IST