సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ajith kumar: ఆసక్తిగల వారికి అజిత్‌ అందిస్తున్న అవకాశం!

ABN, First Publish Date - 2023-05-23T12:50:52+05:30

తమిళస్టార్‌ అజిత్‌కుమార్‌కు బైక్‌ రైడ్‌ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లో విరామం దొరికిన ప్రతిసారి ఆయన బైక్‌పై దేశం మొత్తం చుట్టేస్తుంటారు. ఈసారి దేశం దాటి భూటాన్‌, నేపాల్‌ ప్రాంతాలను చుట్టేసి ఇటీవల చెన్నై చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళస్టార్‌ అజిత్‌కుమార్‌కు (Ajith kumar) బైక్‌ రైడ్‌ (Moto Ride) అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లో విరామం దొరికిన ప్రతిసారి ఆయన బైక్‌పై దేశం మొత్తం చుట్టేస్తుంటారు. ఈసారి దేశం దాటి భూటాన్‌, నేపాల్‌ ప్రాంతాలను చుట్టేసి ఇటీవల చెన్నై చేరుకున్నారు. తాజాగా అజిత్‌ నుంచి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఏకే మోటో రైడ్‌ (Ak moto Ride) పేరుతో ఆయనొక వ్యాపారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘జీవితం అనేది ఓ అందమైన ప్రయాణం, అందులోని ట్విస్ట్‌, టర్న్‌లతోపాటు మనముందున్న తెరిచిన మార్గాలను అనుభవించాలి’ నేను ఇదే పద్దతిని ఫాలో అవుతా. ప్రస్తుతం నేనొక కొత్త బిజినెస్‌ ప్రారంభించబోతున్నా. స్వదేశీ, విదేశీ బైక్‌ రైడింగ్‌ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ మేరకు ఏకే మోటో రైడ్‌ పేరుతో మోటార్‌ బైక్‌ విహార యాత్ర సంస్థను ప్రారంభిస్తున్నా. దీని ద్వారా భారతదేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్‌ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుంది. అలాంటి వారికి తగిన భద్రతతోపాటు సౌకర్యవంతమైన మోటార్‌ బైక్లను సమకూర్చడం జరుగుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి అయన వరల్డ్ టూర్ ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-05-23T12:51:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!