Aishwarya Arjun: వియ్యంకులు కాబోతున్న అర్జున్‌ - తంబి రామయ్య?

ABN , First Publish Date - 2023-06-26T15:59:54+05:30 IST

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు తంబి రామయ్య, సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Arjun Sarja) వియ్యంకులు కాబోతున్నారనే ప్రచారం కోడంబాక్కం వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య, అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ పెళ్లి పీటలెక్కనున్నట్టు వినికిడి.

Aishwarya Arjun: వియ్యంకులు కాబోతున్న అర్జున్‌ - తంబి రామయ్య?

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు తంబి రామయ్య, సీనియర్‌ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Arjun Sarja) వియ్యంకులు కాబోతున్నారనే ప్రచారం కోడంబాక్కం వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య, అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ పెళ్లి పీటలెక్కనున్నట్టు వినికిడి. ఉమాపతి(Umapathi) - ఐశ్వర్య (Aishwarya Arjun) కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు టాక్‌. అదే సమయంలో అర్జున్‌ యాంకర్‌గా వ్యవహరించిన ఓ కార్యక్రమానికి తంబి రామయ్య కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య బంధం మరింతగా దృఢపడింది. ఇదేసమయంలో ఈ ప్రేమ జంట కూడా తమ పెద్దల సమ్మతంలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

1.jpg

తమిళంలో అరకొరగా అంతంత మాత్రంగా ఉంది ఐశ్వర్య కెరీర్. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా, తండ్రి అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయిందా సంగతి తెల్సిందే. అటు ఉమాపతి 4 సినిమాలు చేసినప్పటికీ ఇంకా నిలదొక్కుకోలేదు. వినోదాయ శితం సినిమాలో ఈయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

Updated Date - 2023-06-26T16:11:40+05:30 IST