Actress Anju: అప్పటికే మూడు పెళ్లిళ్లు.. చచ్చినా ముఖం చూడను అన్నాను!

ABN , First Publish Date - 2023-03-28T20:58:50+05:30 IST

‘బాలనాగమ్మ’ (Bala nagamma) చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటి అంజు (actress Anju). తదుపరి కథానాయికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయుకగా నటించారు.

Actress Anju: అప్పటికే మూడు పెళ్లిళ్లు.. చచ్చినా ముఖం చూడను అన్నాను!

‘బాలనాగమ్మ’ (Bala nagamma) చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటి అంజు (actress Anju). తదుపరి కథానాయికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయుకగా నటించారు. తెలుగులో అగ్ని పూలు, నిరీక్షణ, శేషు(2002) చిత్రాల్లో నటించారు. 17 ఏళ్ల వయసులోనే ఆమె టైగర్‌ ప్రభాకర్‌ను (Tiger Prabhakar) పెళ్లి చేసుకున్నారు. ఆ నిర్ణయం జీవితాన్ని తలకిందులు చేసిందని ఆమె చెబుతున్నారు. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? అన్న విషయాలను తాజా ఇంటర్వ్యూలో అంజు చెప్పుకొచ్చారు. (Actress anju)

‘‘నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు అమ్మ నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు తీసుకెళ్లింది. అక్కడ డైరెక్టర్‌ మహేంద్రన్‌ చూసి నన్ను సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా తీసుకున్నారు. అలా నా కెరీర్‌ ప్రారంభమైంది. దక్షిణాది అన్ని భాషల్లోనూ సినిమాలు చేశా. ఇప్పుడు సీరియల్స్‌ చేస్తున్నాను. అయితే అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి కూడా అనుకోకుండా జరిగిపోయింది. ఓ కన్నడ సినిమా చేయడానికి నేను బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్‌ టైగర్‌ ప్రభాకర్‌ నన్ను చూసి ఇష్టపడ్డారు. పెళ్లి ప్రపోజల్‌ పెట్టారు. అయితే అప్పటికే ఆయనకు భార్య, పిల్లలు ఉన్న విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. నేను పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పా. అయినా వదిలిపెట్టలేదు. దాంతో నా తల్లిదండ్రులను అడిగి చెప్తానన్నా. అప్పటికే ప్రభాకర్‌కు దాదాపు 45 ఏళ్లుకు పైబడి ఉన్నాడు. అతన్ని చూడగానే అమ్మానాన్న పెళ్లి లేదు గిళ్లీ లేదన్నారు. కానీ వారి మాట వినకుండా ప్రభాకర్‌నే చేసుకుంటానంటూ ఇంట్లో చెప్పకుండా తన దగ్గరికి వెళ్లిపోయా. అతన్ని ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే అతనికి మూడు పెళ్లిళ్లు అయి పిల్లలున్నారని తెలిసింది. దాని గురించి గట్టిగా అడిగినందుకు నేను అతనికి చెడ్డ అయ్యాను. బాధపడ్డాను. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. నేను గర్భిణిని అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్‌లో పెట్టి కట్టుబట్టలతో తిరిగొచ్చేశాను. ఆ ఇంటిని వదిలి వచ్చేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను. ‘నన్ను చాలా బ్యాడ్‌ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెప్పుడూ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను’ అని చెప్పేసి వచ్చేశా. ఆ తర్వాత చాలా కాలం డిప్రెషన్‌లో ఉండిపోయా. ఆ బాధ నుంచి తేరుకుని మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఇప్పుడు సీరియళ్లతో బిజీగా ఉన్నా’’ అని చెప్పుకొచ్చారు అంజు. (Tiger prabhakar) 5.jpg

Updated Date - 2023-03-29T00:25:53+05:30 IST