2018 movie : ఆస్కార్‌ ఎంపికలో నిరాశ

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:34 PM

మలయాళంలో భారీ విజయం అందుకున్న 2018 (2018 Movie) చిత్రానికి ఆస్కార్‌ (oscar)సెలక్షన్లో నిరాశ ఎదురైంది. యావత సినీ పరిశ్రమగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డు షార్ట్‌ లిస్ట్‌ తాజాగా విడుదలైంది.

2018 movie : ఆస్కార్‌ ఎంపికలో నిరాశ

మలయాళంలో భారీ విజయం అందుకున్న 2018 (2018 Movie) చిత్రానికి ఆస్కార్‌ (oscar)సెలక్షన్లో నిరాశ ఎదురైంది. యావత సినీ పరిశ్రమగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డు షార్ట్‌ లిస్ట్‌ తాజాగా విడుదలైంది. దాదాపు 10 విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాల వివరాలను అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్‌ చిత్రాలు ‘బార్బీ’, ‘ఓపెన్‌ హైమర్‌’ ఎక్కువ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో భారత నుంచి అధికారికంగా ఎంపికైన ‘2018’ చిత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్‌ పోటీలో ఈ సినిమా లేకపోవడంపై సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.  డెన్మార్క్‌కు చెందిన ‘ది ప్రామిస్డ్‌ ల్యాండ్‌’, జపాన్‌కు చెందిన ‘పర్‌ఫెక్ట్‌ డేస్‌’, యూకేకు చెందిన ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ చిత్రా?ని ఈ విభాగంలో ముందున్నాయి. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన కమిటీ.. సెప్టెంబర్‌లో ఈ సినిమాను ఎంపిక చేసి అధికారికంగా ఆస్కార్‌కు పంపిన సంగతి తెలిసిందే! 

2018లో కేరళలో సంభవించి, వందల మంది మరణానికి గురైన వరదలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళంతో పాటు, ఇతర బాషల్లోనూ ఈ సినిమా మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది, టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దీనిని తెరకెక్కించారు. 


Updated Date - Dec 22 , 2023 | 03:44 PM