Agent on OTT: అఖిల్ సినిమా అందుకేనా అంత డిలే అయింది

ABN , First Publish Date - 2023-06-03T16:55:13+05:30 IST

అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా మే 19 న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వాల్సి వుండింది. సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఈ సినిమా విడుదల అయినా మొదటి రోజే ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఓటిటి స్ట్రీమింగ్ వాయిదా వేశారు, కొత్త తేదీ ప్రకటించలేదు, ఇంతకీ ఎందుకు డిలే అయింది.

Agent on OTT: అఖిల్ సినిమా అందుకేనా అంత డిలే అయింది
Akhil Akkineni from Agent

అఖిల్ అక్కినేని (AkhilAkkineni), దర్శకుడు సురేందర్ రెడ్డి (SurenderReddy) కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' #Agent సినిమా ఏప్రిల్ 28న థియేటర్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షో నుండే ప్లాప్ టాక్ వచ్చి, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే కుదేలు అయి, రెండో రోజుకి కొన్ని థియేటర్స్ నుండి ఈ తీసేసే పరిస్థితి కూడా వచ్చింది. అంతలా ఈ సినిమా గురించి బాడ్ వచ్చింది. అనిల్ సుంకర (Anil Sunkara) ఈ సినిమాకి నిర్మాత కాగా, సాక్షి వైద్య (SakshiVaidya) ఈ సినిమాతో కథానాయకురాలిగా అరంగేట్రం చేసింది.

agent-akhilakkineni.jpg

అయితే ఈ సినిమా తొందరగానే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది #AgentOnOTT అని ప్రకటించారు. ముందుగా అనుకున్న ప్రకారం మే 19న (May 19) ఈ సినిమా సోనీ లివ్ (SonyLiv) లో స్ట్రీమింగ్ అవ్వాల్సి వుంది. కానీ ఆరోజు అవలేదు, స్ట్రీమింగ్ పోస్టుపోన్ చేసేసారు. కొత్త తేదీ సోనీ లివ్ వాళ్ళు ఇంకా ప్రకటించలేదు కానీ, జూన్ 23న (June 23) స్ట్రీమింగ్ అవుతోంది అని తెలిసింది.

ఇంతకీ ఈ సినిమాని ఎందుకు డిలే చేసారు అంటే, ఓటిటి లో అయినా మార్పులు చేసి విడుదల చేద్దాం అని చిత్ర నిర్వాహకులు అంటున్నారట. సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యాక, చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏవేవి బాగోలేదు అన్నారో, వాటిల్లో కొంచెం అయినా బాగుండేట్టు చేద్దాం అని అనుకున్నారట. #AgentOnOTT అందుకని మళ్ళీ ఈ సినిమాని ఎడిటింగ్ చేస్తున్నారు అని వినికిడి. ఎందుకంటే ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే హిందీ భాషలో కూడా థియేటర్ లో విడుదల చెయ్యాలి, కానీ చెయ్యలేదు.

agent-akhilakkineni3.jpg

ఇప్పుడు హిందీ ప్రేక్షకులకి కూడా బాగుండాలి అని ఈ ఓటిటి విడుదలలో చాలా మార్పులు చేస్తున్నారు అని తెలిసింది. ఎడిటింగ్ చెయ్యడంతో పాటు, కొన్ని సన్నివేశాలు అతికిస్తున్నారని కూడా తెలిసింది. #AgentOnOTT ఎందుకంటే చాలా సన్నివేశాలు తీసి సినిమాలో పెట్టనివి వున్నాయి, వాటిని ఇప్పుడు అతికించి, కొత్తగా ఎడిటింగ్ చేసి, సినిమా కొత్తగా ఉండేట్టు చేస్తున్నారు అని వినికిడి. అందుకే ఈ సినిమా డిలే అయింది అని, ఇప్పుడు జూన్ 23 కి స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి:

Ahimsa Film Review: ప్రేక్షకుడికి హింస, ఇదొక అరాచకం

Updated Date - 2023-06-03T16:55:13+05:30 IST